`బ్లాక్డ్` చిత్రం ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

మనోజ్‌ నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా వస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్ చిత్రం `బ్లాక్డ్‌`. రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై ప‌ద్మ లెంక నిర్మిస్తుంది. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. `బ్లాక్డ్`మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్‌లోగోని ఈ రోజు చిత్రబృందం విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ లొడ‌గ‌ల మాట్లాడుతూ..‘‘బ్లాక్డ్ మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్‌లోగోని రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా చిత్రం తెర‌కెక్కింది.  నటీనటులు, సాంకేతిక బృందం స‌హ‌కారంతో మూవీ ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. అలాగే మా నిర్మాత ప‌ద్మ లెంక ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాని రిచ్ లోకేష‌న్స్‌లో తెర‌కెక్కించ‌డానికి తోడ్ప‌డ్డారు. ‘బ్లాక్డ్’ మూవీ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌ కానుంది. అన్ని పాట‌లు త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్ని అల‌రిస్తాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్, పాట‌ల‌ని విడుద‌ల‌చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం..’’ అని తెలిపారు. షేకింగ్‌ శేషు, స‌త్య శ్రీ‌, మెహ‌బూబ్ భాష‌, విన‌య్ మ‌హ‌దేవ్‌, రామారావు లెంక‌, శ్రీ‌నివాస‌రాజు, గుండు ముర‌ళి, దివ్య‌, ప‌ద్మావ‌తి తదితరులు నటిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.