‘బోయ్‌ చిత్రం ముందస్తు వేడుక

లక్ష్‌, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమా `బోయ్`. హై స్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అమర్ విశ్వరాజ్. నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్.జె ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగ‌స్ట్ 23న సినిమా విడుదల అవుతుంది. ఈ సంద‌ర్భంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుక మంగ‌ళ‌వారం జ‌రిగింది. పలువరు మాట్లాడతూ.. ప్యాన్ ఇండియాలో ఈ సినిమాలో అబ్బాయి పాత్ర కోసం తిరిగాం. చివ‌ర‌కు ఆష్క‌ర్ ల‌క్ష్‌ను చూపించారు. వెంట‌నే చేశాం. ఇతను ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ హీరో అవుతాడు. త‌ను దొర‌క‌డం నా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. అమ్మాయి సాహితి..కూచిపూడి డ్యాన్స‌ర్‌. అద్భుతంగా న‌టించింది. అంద‌రూ చాలా నేచుర‌ల్‌గా న‌టించారు. చిత్ర ముఖ్య అతిథిగా వచ్చిన రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ..``సినిమా ట్రైల‌ర్ చూస్తే.. అందులో హానెస్ట్ క‌న‌ప‌డుతుంది. తొలి సినిమా ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో, ల‌వ్ సబ్జెక్టో చేయ‌వ‌చ్చు. కానీ.. బోయ్‌లాంటి సినిమా చేయాల‌నుకోవ‌డం చాలా గొప్ప విష‌యం. గ‌త నాలుగైదేళ్లుగా చిన్న సినిమాలే పెద్ద విజ‌యాల‌ను సాధిస్తున్నాయి చెప్పారు. ఈ కార్యక్రమంలో లక్ష్, సాహితి, నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.