నాకు పోటీ వచ్చాడనిపించింది :కార్తికేయ

శి
వ కందుకూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకురాలు. రాజ్‌ కందుకూరి నిర్మాత.  శుక్రవారం విడుదల కానుంది. హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. కథానాయకులు నిఖిల్‌, శ్రీవిష్ణు బిగ్‌ టికెట్‌ని కొనుగోలు చేశారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ ‘‘శివ చూడగానే నచ్చాడు. ‘నాకు పోటీగా ఓ హీరో వచ్చాడు’ అనిపించింది. మంచి స్థాయికి వెళ్తాడన్న నమ్మకం ఉంద’’న్నారు. నందినీరెడ్డి మాట్లాడుతూ ‘‘గోపీ సుందర్‌ సంగీతం నాకు ఇష్టం. రాజ్‌ కందుకూరి లాంటి తండ్రి ఉండడం శివ అదృష్టం’’ అన్నారు. జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘శివ సినిమా విడుదల  అవుతుంటే మా పిల్లల సినిమా వస్తున్నంత ఆనందంగా ఉంది. ఈ సినిమాతో శేష సింధు మహిళా శక్తిని మరోసారి నిరూపించాలి. ఆమెను చూసి మరింత మంది అమ్మాయిలు ఈ రంగంలోకి రావాల’’న్నారు. ‘‘ఈ చిత్రంలో అమ్మ పాత్రలో నటించమన్నారు. కానీ ఆరోగ్యం సహకరించక పోవడంతో కుదరలేద’’న్నారు రేణూ దేశాయ్‌. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఏడాదికి ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ సినిమా తీశాన’’న్నారు. దర్శకురాలు మాట్లాడుతూ ‘‘ప్రతీ పాత్రనీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటార’’న్నారు. కార్యక్రమంలో తరుణ్‌ భాస్కర్‌, శివ, మాళవిక, వర్ష, గోపీసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.