మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85వ జయంతి హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంలో రామానాయుడు తనయుడు సురేష్ బాబు, నిర్మాత సి.కల్యాణ్ మరో నిర్మాత కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామానాయుడు మనవడు అభిరామ్ మాట్లాడుతూ..తాతగారు భౌతికంగా మన మధ్య లేకపోయిన మన మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే నా జీవితం ఇంకా బాగుండేదని అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ..‘‘నా హీరో అంటే నాయుడుగారు. నాకు సినిమాలు తీయడానికి ప్రేరణ ఆయనే. నాకు ఆయన దగ్గర బాగా చనువు ఉండేదని’’ అన్నారు.