ఆ ఊరిలో ఏం జరిగింది

దిలీప్‌కుమార్‌ సల్వాది కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘దిక్సూచి’. చాందిని నాయిక. శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మాతలు. ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకర్ల సమావేశంలో నరసింహరాజు మాట్లాడుతూ ‘‘ఇది భక్తి భావాలు మిళితమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. మంచి చిత్రాలు అందించాలని తొలి ప్రయత్నంగా ఈ సినిమాని తీశాను. నా రెండో సినిమాకీ శ్రీకారం చుట్టాను’’ అని అన్నారు. దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘1970లో ఓ ఊళ్లో ఏం జరిగింది? దాని వెనుక దాగిన వాస్తవాల్ని వెలికితీసేందుకు ఓ కుర్రాడు చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఆసక్తికరంగా నడిచే కథ. ఎనిమిది పాటలున్నాయ’’న్నారు. నాయిక చాందిని మాట్లాడుతూ ‘‘భక్తి, ప్రేమ, హారర్‌ కలగలసిన చిత్రం. ఓ కీలక పాత్రను ధన్వీ పోషించింద’’ని అంది. నూతన నటుడు సుమన్‌, జేమ్స్‌ తదితరులు పాల్గొన్నారు. ఛాయాగ్రహణం: జయకృష్ణ.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.