‘ఘాఠి’లో ఏం జరిగింది?


దిలీప్‌ రాథోడ్, డా.పూనమ్‌ శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఘాఠి’. వాల్మీకి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగు, బంజార భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం హైదరాబాద్‌లో నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, ఎ.గురురాజ్‌ విడుదల చేశారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘రాజస్థాన్‌లోని ఘాఠి అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. అక్కడ జరిగిన గొడవ, దాని పర్యవసనాలు ఏమిటన్నది తెరపైనే చూడాలి. ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాలకి ప్రాధాన్యముంద’’న్నారు. ‘‘ఇప్పటివరకు తెరపై చూడని ఓ కొత్త కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించమని’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్‌. ఈ సినిమాతో ఎంతోమంది ప్రతిభావంతులు పరిచయం అవుతున్నారని తెలిపారు దిలీప్‌ రాథోడ్‌. ఈ కార్యక్రమంలో బంజార జాతీయ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.