గోపీచంద్‌ ఇంట ప్రభాస్‌, బన్నీ సందడి

ప్రముఖ కథానాయకులు ప్రభాస్‌, అల్లు అర్జున్‌ గోపీచంద్ ఇంట సందడి చేశారు. తీరిక లేకుండా బిజీగా ఉండే ఈ ముగ్గురు ఓ చోట కలవడమేంటి? అదీ ఇంట్లోనా అనుకుంటున్నారా. సాధారణ వ్యక్తులైనా, సెలబ్రిటీలైనా వేడుకంటే అందరూ కలవాల్సిందే. ఆనందం పంచుకోవాల్సిందే. అలాంటి ఓ కార్యక్రమానికే హాజరయ్యారు బన్నీ, ప్రభాస్‌. శుక్రవారం గోపీచంద్‌ రెండో కుమారుడు వియాన్‌ మొదటి పుట్టిన రోజు. ఈ వేడుకకు వాళ్లిద్దరితోపాటు రామ్‌, మంచు విష్ణు, దర్శకులు బోయపాటి శీను, తేజ, వంశీ పైడిపల్లి, సంపత్‌ నంది హాజరై  వియాన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. తారలందరినీ ఓకే వేదికపై చూడటంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.