ఆయన నటిస్తున్నారంటే నిద్ర పట్టలేదు


ది సాయికుమార్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బుర్రకథ’. మిస్తీ చక్రవర్తి, నైరాశా కథానాయికలు. డైమండ్‌ రత్నబాబు దర్శకుడు. శ్రీకాంత్‌ దీపాల, కిషోర్‌, కిరణ్‌రెడ్డి నిర్మాతలు. శుక్రవారం విడుదల చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుకని నిర్వహించారు. రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌, సాయికుమార్‌ ఈ వేడుకకి హాజరయ్యారు. ఆది మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఈ కథ చెప్పగానే ఆసక్తికరంగా అనిపించింది. రాజేంద్రప్రసాద్‌ నటిస్తున్నారనగానే ఆతృతతో వారం రోజులు నిద్రపట్టలేదు. ఆయనతో ఇదివరకు ‘లవ్‌లీ’, ‘శమంతకమణి’ చేశా. తొలి రోజు కలవగానే ఎంతో ప్రోత్సహించారు. ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుంద’’న్నారు. సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘ఆది సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డైమండ్‌ రత్నం విజయంపై నమ్మకంగా ఉన్నార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక తలలో రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో రూపొందించిన చిత్రమిది. వినోదాన్ని పంచుతుంది. భావోద్వేగాలూ ఉంటాయ’’న్నారు. శ్రీకాంత్‌ దీపాల మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్ని భిన్నమైన అనుభూతికి గురి చేస్తుందీ చిత్రం’’ అన్నారు. ‘‘ఆది ఈ సినిమాలో రెండు కోణాల్లో సాగే పాత్రలో బాగా నటించాడు. తన నటనని చూసి ఆశ్చర్యపోయా. రత్నం స్వతహాగా రచయిత. మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడ’’న్నారు రాజేంద్రప్రసాద్‌. కార్యక్రమంలో నటుడు పృథ్వీరాజ్‌, ఛాయాగ్రాహకుడు రామ్‌ప్రసాద్‌, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, నృత్య దర్శకుడు భాను, మణిచందన తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.