వాస్తవ సంఘటనల ఆధారంగా..


దర్శకుడు సంపత్‌ నంది అందిస్తున్న కథతో ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. వశిష్ట సింహ, హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు అశోక్‌ తేజ్‌ తెరకెక్కిస్తున్నారు. కె.కె.రాధా మోహన్‌ నిర్మాత. ఈ చిత్రం తాజాగా చిత్రీకరణ ప్రారంభించుకుంది. ‘‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో చిత్రం రూపొందుతోంది. మేకప్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు వంటివేం లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించనున్నారు. ఇందులో హెబ్బా పల్లెటూరి అమ్మాయిగా ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తోంద’’ని చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: ఎస్‌.సౌందర్‌ రాజన్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.