చమకు చమకు ఛాం
article imageచిరం‌జీవి మేన‌ల్లుడు సాయి‌ధ‌రమ్‌ తేజ్‌ హుషా‌రైన కుర్రాడు.‌ తెలి‌విగా తన కెరీ‌ర్‌ని మల‌చు‌కొం‌టు‌న్నాడు.‌ త్వర‌లోనే తెరపై కూడా ‌‘ఇంటి‌లి‌జెంట్‌’‌గా వినోదం పంచ‌బో‌తు‌న్నారు.‌ వి.‌వి.‌వినా‌యక్‌ దర్శ‌క‌త్వంలో సాయి‌ధ‌రమ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా ‌‘ఇంటి‌లి‌జెంట్‌’‌ తెర‌కె‌క్కు‌తోంది.‌ సి.‌కల్యాణ్‌ నిర్మాత.‌ ఈ సినిమా ప్రచార కార్య‌క్రమాలు ఊపం‌దు‌కొ‌న్నాయి.‌ అగ్ర కథా‌నా‌య‌కులు బాల‌కృష్ణ టీజ‌ర్‌ని, ప్రభాస్‌ ‌‘లెట్స్‌ డూ’‌ అనే గీతాన్ని ఇటీ‌వల హైద‌రా‌బా‌ద్‌లో వేర్వే‌రుగా జరి‌గిన కార్య‌క్రమాల్లో విడు‌దల చేశారు.‌ చమకు చమకు ఛాం.‌.‌.‌తో పాటు, నా సెల్‌ఫోన్‌.‌.‌.‌ గీతాన్ని కూడా ఆన్‌లైన్‌ ద్వారా విడు‌దల చేశారు.‌ ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లా‌డుతూ ‌‘‌‘వి.‌వి.‌వినా‌య‌క్‌తో కలిసి ఇంతకు ముందు ‌‘చెన్న‌కే‌శ‌వ‌రెడ్డి’‌ చేశా.‌ పరి‌శ్రమ గర్విం‌చ‌దగ్గ దర్శ‌కు‌డా‌యన.‌ సాయి‌ధ‌రమ్‌ తేజ్‌ నటిం‌చిన ‌‘ఇంటె‌లి‌జెంట్‌’‌ టీజర్‌ నా చేతుల మీదుగా విడు‌దల కావడం ఆనం‌దంగా ఉంది.‌ సి.‌కె.‌ఎంట‌ర్‌టై‌న్‌మెంట్స్‌ నా సొంత నిర్మాణ సంస్థతో సమానం.‌ ఈ సినిమా టీజర్‌ చాలా బాగుంది.‌ సినిమా ఎప్పు‌డె‌ప్పుడు చూడాలా అనే ఉత్సు‌కత రేకె‌త్తి‌స్తోంది.‌ యువ‌తకి ఈ సినిమా తప్ప‌కుండా చేరు‌వ‌వు‌తుం‌దనే నమ్మకం నాకుంది.‌ మెగా అభి‌మా‌నులు, ఇది నా సొంత నిర్మాణ సంస్థతో సమానం కాబట్టి మా అభి‌మా‌నులు ఈ చిత్రాన్ని ఆద‌రి‌స్తార’‌’‌న్నారు.‌ సాయి‌ధ‌రమ్‌ తేజ్‌ మాట్లా‌డుతూ ‌‘‌‘కొత్త ప్రతి‌భని ప్రోత్స‌హిం‌చ‌డంలో బాల‌కృష్ణ ముందుం‌టా‌రని అందరూ అంటారు.‌ ఆ విష‌యంలో మరో‌సారి రుజు‌వైంది.‌ కథా‌నా‌య‌కుడు ప్రభా‌స్‌ని మా కుటుంబ సభ్యు‌డిలా భావిస్తాం.‌ తన చేతుల మీదుగా పాట విడు‌ద‌ల‌కా‌వడం ఆనం‌దంగా ఉంద’‌’‌ని సాయి‌ధ‌రమ్‌ చెప్పాడు.‌ వి.‌వి.‌వినా‌యక్‌ మాట్లా‌డుతూ ‌‘‌‘స్నేహా‌నికి ప్రాణం ఇస్తాడు ప్రభాస్‌.‌ చిన్న చిన్న విష‌యా‌లకే సంతో‌ష‌ప‌డి‌పో‌తాడు.‌ ఆ ఆనం‌దాన్ని ఈరోజు మా అంద‌రికీ పంచాడు.‌ టీజర్‌ చూసిన వాళ్లంతా తేజు చిరం‌జీ‌విలా ఉన్నా‌డని చెబు‌తుంటే ఆనం‌దంగా ఉంది.‌ బాల‌కృష్ణ మేం అడి‌గిన వెంటనే వేడు‌కకి వచ్చి టీజర్‌ విడు‌దల చేశారు.‌ ఆయన రావ‌డంతో మా సినిమా ఘన విజయం సాధిం‌చిం‌దనే అను‌భూతి, ఆనం‌దంలో ఉన్నాం’‌’‌ అన్నారు.‌ ప్రభాస్‌ మాట్లా‌డుతూ ‌‘‌‘వినా‌యక్‌ దర్శ‌క‌త్వంలో ‌‘యోగి’‌ చిత్రా‌నికి పని‌చేశా.‌ నా జీవి‌తంలో ఏ సిని‌మాకీ అంత ఆనం‌దంగా పని‌చే‌య‌లేదు.‌ అందుకే వినా‌యక్‌ అంటే నాకు చాలా ఇష్టం.‌ ఓ పాట విడు‌దల చేయాలి.‌.‌ వస్తావా, అని వినా‌యక్‌ మొహ‌మాట పడుతూ అడి‌గారు.‌ ఆయన ఫోన్‌లో ఓ చిన్న మెసేజ్‌ ఇస్తే చాలు ఎక్క‌డికి రమ్మంటే అక్క‌డికి వస్తా.‌ ‌‘చమకు చమకు ఛాం’‌ చిరం‌జీ‌వి‌గారి కెరీ‌ర్‌లో అత్యు‌త్తమ గీతాల్లో ఒకటి.‌ అందులో ఆయన చాలా మంచి స్టెప్పులు వేశారు.‌ మరి సాయి‌ధ‌రమ్‌ తేజ్‌ ఎలా వేశాడో చూడా‌లని ఆత్రు‌తగా ఉంది’‌’‌ అన్నారు.‌ ‌‘‌‘తమన్‌ స్వర‌ప‌రి‌చిన నాలుగు పాటల్ని నాలుగు దఫా‌లుగా విడు‌దల చేశాం.‌ ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసు‌కొ‌స్తామ’‌’‌న్నారు నిర్మాత.‌ ఈ కార్య‌క్రమంలో రచ‌యిత ఆకుల శివ, లావణ్య త్రిపాఠి పాల్గొ‌న్నారు.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.