‘స్టార్ట్ కెమెరా.. యాక్షన్’ ఈ మాట సినీ పరిశ్రమలో వినిపించి రెండు నెలలు గడిచింది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్‌కి తాజాగా అనుమతి లభించింది. చిరంజీవి నేతృత్వంలో గురువారం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని పలువురు ప్రముఖుల కలిసి చిత్ర పరిశ్రమలో నెలకొన్న ఇబ్బందులు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. జూన్ మొదటివారం నుంచి చిత్రీకరణలు ప్రారంభించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. కొవిడ్-19 మార్గదర్శకాలను అనుసరిస్తూ షూటింగ్స్ జరపాలని చిత్ర పరిశ్రమ పెద్దలకు సూచించారు. చిత్రీకరణ అనుమతి, థియేటర్ల పునఃప్రారంభంపై విధి విధానాలనున ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, రాజమౌళి, దిల్‌రాజు, త్రివిక్రమ్, ఎన్.శంకర్, రాధాకృష్ణ, సి.కల్యాణ్, సురేశ్ బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేశ్, ప్రవీణ్ బాబు తదితరులు తలసాని ఆధ్వర్యంలో కేసీఆర్‌ని కలిశారు.