పిజ్జాను మించి భయపెట్టే చిత్రం
‘మా సంస్థ నుంచి ‘పిజ్జా’ ప్రేక్షకుల్ని భయపెట్టి మంచి విజయాన్ని సాధించింది. దాన్ని మించి భయపెట్టే చిత్రం ‘లిసా’. త్రీడీలో రూపొందిన తొలి హారర్‌ చిత్రమిది’’ అన్నారు సురేష్‌ కొండేటి. ఆయన ఎస్‌.కె.పిక్చర్స్‌ పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న చిత్రం ‘లిసా’. అంజలి ముఖ్యభూమిక పోషించారు. రాజు విశ్వనాథం దర్శకుడు. వీరేష్‌ కాసాని సమర్పకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 24న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సురేష్‌ కొండేటి బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

తొలిసారి నేను చూసిన త్రీడీ చిత్రం ‘చిన్నారి చేతన’. ‘లిసా’ చూసినప్పుడు నాకు ‘చిన్నారి చేతన’ గుర్తుకొచ్చింది. ఇందులో హారర్‌ కామెడీతోపాటు, సెంటిమెంట్‌ కూడా ఉంటుంది.
ఓ’కి పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులు ఈ సినిమాని తీర్చిదిద్దారు. రోజుకి రూ: 2.5 లక్షల ఖరీదైన కెమెరాల్ని చిత్రీకరణ కోసం వినియోగించారు. త్రీడీలో విజువల్స్‌ ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. అంజలి, బ్రహ్మానందం తదితరుల నటన చక్కటి వినోదాన్ని పంచుతుంది’’.

‘‘కథానాయిక అంజలి సలహాతోనే ‘షాపింగ్‌ మాల్‌’, ‘జర్నీ’ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చా. ఈ చిత్రం గురించి కూడా అంజలి, దర్శకుడు ముందే చెప్పారు. మా కలయికలో మరో మంచి విజయం ఖాయమని నమ్ముతున్నా. ప్రతి మల్టీప్లెక్స్‌ థియేటర్‌లోనూ ఇప్పుడు త్రీడీ తెరలున్నాయి. లేని చోట్ల 2డీలోనూ ఈ సినిమా విడుదలవుతోంది. 400 థియేటర్లలో విడుదలవుతున్న ‘లిసా’ ఈ వేసవిలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. తదుపరి షకలక శంకర్‌ కథానాయకుడిగా ‘శ్రీకాకుళం’ పేరుతో ఓ చిత్రం చేయబోతున్నా. ‘ఎర్రచ్కీచీజిర’లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నా’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.