ల‌వ్,లైఫ్ అండ్ పకోడి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణలో కార్తిక్‌, సంచిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్‌, లైఫ్‌ అండ్ పకోడి. జయంత్‌ గాలి దర్శకత్వంలో క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా నిర్మితమౌతుఉంది.తాజాగా ఈ మూవీ ఫ‌స్టులుక్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత జయంత్‌ గాలి మాట్లాడుతూ..‘‘ ఈ తరం యువత ఎలాంటి బంధాలను ఏర్పరుచుకోవడానికి జంకుతుంటారు. సరైన నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతుంటారు. అలాంటి యువతీ యువకుల మధ్య బంధాలు ఎలా ఉంటాయి, వారు ఎలా ముందుకు సాగేరన్న నేపథ్యంలో సాగనుంది. ఈ తరం యవతీయవకులకీ ఖచ్చితంగా చేరువుతోందని...అంటున్నారు. మధుర శ్రీధర్‌రెడ్డి సమర్పణలో వస్తున్న చిత్రానికి పవన్ సంగీత స్వరాలు సమకూస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.