ఆ ప్రమాదం నా జీవితాన్ని నాశనం చేసింది: మహిమ

శ్రీకాంత్‌, జగపతిబాబు కలిసి నటించిన చిత్రం ‘మనసులో మాట’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రియగా నటించింది మహిమ చౌదరి. ఇంగ్లీష్‌ నవల ‘ది వర్డ్ ఇన్‌ మై హార్ట్’ ఆధారంగా తమిళంలో తెరకెక్కిన ‘కన్నెదిరీ థాండ్రినల్‌’కి ఈ చిత్రం రీమేక్. మహిమ ఈ చిత్రం తరువాత ప్రకాష్‌ ఝా దర్శకత్వంలో ‘దిల్‌ క్యా కరే’ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌తో కలిసి పనిచేసింది. ఆ సమయంలో ఓ పెద్ద ప్రమాదం జరిగిందట. ‘ఆ ఘోర ప్రమాదం నా జీవితాన్ని నాశనం చేసిందని’ చెబుతోంది మహిమా చౌదరి. ఆనాటి సంఘటన గురించి తాజాగా ఓ ఆంగ్లమీడియాతో మహిమ మాట్లాడుతూ..‘‘దిల్‌ క్యా కరే’ చిత్రంలో అజయ్‌తో కలిసి నటిస్తున్నా. అప్పుడు బెంగళూరులో ఓ స్టూడియోకి కారులో వెళ్తున్న. నా కారును ట్రక్‌ ఒక్కటి బలంగా ఢీకొట్టింది. అప్పుడు అద్దాలు అన్నీ పగిలి నా ముఖంలో గుచ్చుకున్నాయి.


ఆ సయమంలో నేను చచ్చిపోతానేమో అనుకున్నా. ఆసుపత్రిలో చేర్చడానికి సాయంగా ఒక్కరు కూడా రాలేదు. ఆ తరువాత ఏలాగో ఆసుపత్రికి వెళ్లాను. అప్పుడు మా అమ్మ, అజయ్‌లు వచ్చి నన్ను పరామర్శించారు. తరువాత నేను నా ముఖాన్ని అద్దంలో చూసుకోగా, చాలా భయానకంగా ఉంది. నాకు శస్ర్త చికిత్స చేసినప్పుడు సుమారు అరవైఏడు గాజు ముక్కలను బయటకు తీశారట. తరువాత నాకళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. ఇంటిలోపలే ఉండాలి. ఎలాంటి సూర్యకిరణాలు చూడకూడదు. కనీసం గదిలో కూడా కిరణాలు పడకూడదు. ఆ సమయంలో ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయాను. ఆ సమయంలో నాకు ప్రజలు కూడా సరైన మద్దతు ఇవ్వలేదు..’’అని చెప్పింది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.