పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "మెరిసే మెరిసే"!

కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ''మెరిసే మెరిసే''. ఈ చిత్రంలో హుషారు ఫెమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ కథానాయికగా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్‌తో కూడిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ...మెరిసే మెరిసే మూవీ చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్, ఫస్టులుక్‌కు మంచి స్పందన లభించింది. త్వరలోనే ఈ సినిమాలోని పాటలను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాము. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు. నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ... సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోంది. మా మూవీకి మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు. చిత్రంలో సంజయ్‌ స్వరూప్‌, గురు రాజ్‌, సంధ్య జనక్‌ తదితరులు నటిస్తున్నారు. కెమెరామెన్: నగేష్ బన్నెల్ సంగీతం: కార్తిక్ కొడగండ్ల.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.