‘ప్రేమనగర్‌’ ప్రేరణతోనే.. ‘మిస్టర్‌ మజ్ను’

‘‘ఏ నటుడికైనా ఆత్మ విమర్శ చేసుకోవడం చాలా అవసరం. అఖిల్‌ అలా తనని తాను విమర్శించుకోగలడు. అదే తనని ఓ గొప్ప నటుడిగా మారుస్తుంది’’ అని అన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. అఖిల్‌ నటించిన ‘మిస్టర్‌ మజ్ను’ విడుదల ముందస్తు వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సంపాదించిన ప్రతి రూపాయినీ మళ్లీ సినిమాకే అందించే నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌. నేను పరిశ్రమకొచ్చిన కొత్తలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉండేవారు. వాళ్లలో వెంకీ అట్లూరి ఒకరు. తను నాకో నటుడిగా పరిచయం, తరవాత రచయితగా, దర్శకుడిగా పరిచయయ్యాడు. సుదీర్ఘమైన చలన చిత్రసీమలో ఎన్నో ప్రేమకథ చిత్రాలొచ్చాయి. తను ‘తొలిప్రేమ’లో కొత్తగా ఏం చూపిస్తాడో అనే బెరుకు ఉండేది. ఆ చిత్రం చూసిన తరవాత గర్వంగా అనిపించింది. ఓ కమర్షియల్‌ సినిమా తీయడం కన్నా కేవలం కథతో సినిమా తీయడం కష్టమైన పని. మొదటి చిత్రంతోనే అది సాధించాడు వెంకీ. రాసిపెట్టుకోండి.. అఖిల్‌ ఏదో ఓ రోజు టాలీవుడ్‌లో మంచి నటుడిగా నిలిచిపోతాడు. అదెంతో దూరంలో లేద’’న్నారు. అఖిల్‌ని ఓ ప్రేమకథలో చూడాలన్న కోరిక ఈ సినిమాతో తీరిందన్నారు నాగచైతన్య. ‘శివ’ సినిమా చూసి చాలా స్ఫూర్తి పొందానని, ‘ప్రేమనగర్‌’లోని కథానాయకుడి పాత్ర నుంచి ప్రేరణ పొంది ఈ కథ రాసుకున్నానని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు.


ఆరు పాటలూ బాగున్నాయంటే అదంతా చిత్రబృందం చేసిన సమష్టి కృషే అని చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ చెప్పారు. ‘‘వెంకీతో నాకు పదేళ్ల నుంచీ స్నేహం ఉంది. మూడేళ్ల క్రితం ఈ కథ చెప్పాడు. నా కోసం ఇంతకాలం ఆగాడు. నేను తారక్‌ని టైగర్‌ అనే పిలుస్తా. నిజంగా తను పులి. ఆయన ఉత్సాహాన్ని ఎవ్వరూ అందుకోలేరు’’ అని అన్నారు. ‘‘నటన, మాస్‌.. ఈ రెండూ తారక్‌ నుంచి అఖిల్‌ నేర్చుకోవాలి. వెంకీ తీసిన ‘తొలి ప్రేమ’ చూశాను. ప్రేమకథకు ఏం కావాలో తనకు బాగా తెలుసు. పాటలు బాగున్నాయి. ‘మజ్ను’ టైటిల్‌ నాన్నగారిది. ఆ తరవాత నా దగ్గరకు వచ్చింది. ఆ రెండు చిత్రాలూ ఎంత పెద్ద విజయాలు సాధించాయో ఈ మజ్ను కూడా అలాంటి విజయాన్నే అందుకోవాలి’’ అన్నారు నాగార్జున.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.