రవితేజతో కలిసి నటించడం నా కల..

‘ఇస్మార్ట్ శంకర్‌'లో తెలంగాణ యాసలో అలరించిన కథానాయిక నభా నటేష్‌. తాజాగా రవితేజ నటిస్తున్న 'డిస్కోరాజా' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నభా నటేష్‌ మాట్లాడుతూ..''ఈ చిత్రంలో రవితేజతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. నేను రవికి పిచ్చాగా అభిమానించే ఒక మామూలు అభిమానిని. అలాంటిది ఏకంగా ఆయనతో కలిసి ఈ చిత్రంలో నటించడం అంటే నాకు మాటలు రావట్లేదు. ఆయన సరసన నటించడం నాకల. ఇప్పుడు నా చిరకాల కోరిక నెరవేరిందని..''చెప్పింది. వి.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'డిస్కోరాజా' చిత్రం జనవరి24, 2020న తెరపైకి రానుంది. ప్రస్తుతం నభా, సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి సోలో బతుకే సో బెటర్‌ చిత్రంలో చేస్తుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.