జయహో... నరసింహం
ఎంత మౌనంగా బాధల్ని భరి‌స్తాడో.‌.‌.‌ అంత మూర్ఖంగా ప్రాణాల్ని తీసే‌స్తాడు.‌
కానీ అది తెలి‌యక అత‌ని‌తోనే కయ్యా‌నికి దిగారు కొంత‌మంది.‌
అంతే.‌.‌.‌ ‌‘సింహం మౌనాన్ని సన్యాసం అను‌కో‌వద్దు.‌.‌.‌ సైలెం‌టుగా ఉందని కెలి‌కితే తల కొరి‌కే‌స్తది’‌ అంటూ రెచ్చి‌పో‌యాడు.‌ తనతో పెట్టు‌కొ‌న్న‌వాళ్ల భరతం పట్టాడు.‌
ఈ నర‌సిం‌హాన్ని కొట్టా‌లంటే టైమింగ్‌ తెలి‌సుం‌డా‌లని చెబు‌తుం‌టారు ఆయన గురించి తెలి‌సి‌న‌వాళ్లు.‌
ఇంద్రుడు.‌.‌.‌ చంద్రుడు అతడి ముందు జీరో.‌
జనాల్లో నెంబర్‌ వన్‌ హీరో.‌
రౌడీ.‌.‌ మెకా‌నిక్‌ రౌడీ.‌ ఫ్యాక్ష‌నిస్టు.‌.‌.‌ సైక్లిస్టు.‌ −‌ ఇలా అన్నీ ఆయనే.‌
కానీ లవ్‌లో మాత్రం వేస్టు.‌ అసలు అతని గత‌మేంటో తెలి‌యా‌లంటే మాత్రం ‌‘జై సింహా’‌ చూడా‌ల్సిందే.‌ బాల‌కృష్ణ ద్విపా‌త్రా‌భి‌నయం చేసిన చిత్రమిది.‌ నయ‌న‌తార, హరి‌ప్రియ, నటాషా దోషి కథా‌నా‌యి‌కలు.‌ కె.‌ఎస్‌.‌రవి‌కు‌మార్‌ దర్శ‌కత్వం వహిం‌చారు.‌ సి.‌కల్యాణ్‌ నిర్మాత.‌ చిరం‌తన్‌ భట్‌ స్వరాలు సమ‌కూ‌ర్చారు.‌ సంక్రాంతి సంద‌ర్భంగా 12న చిత్రం ప్రేక్ష‌కుల ముందు‌కొ‌స్తోంది.‌ ఈ సంద‌ర్భంగా హైద‌రా‌బా‌ద్‌లో విడు‌ద‌లకి ముందస్తు వేడుక జరి‌గింది.‌ ప్రముఖ దర్శ‌కులు వి.‌వి.‌వినా‌యక్, బోయ‌పాటి శ్రీను ముఖ్య అతి‌థు‌లుగా హాజరై చిత్రబృం‌దా‌నికి ప్లాటి‌నమ్‌ డిస్క్‌ జ్ఞాపి‌కలు అంద‌జే‌శారు.‌ అనం‌తరం అతి‌థులు, చిత్రబృందం చెప్పిన విష‌యాలు వారి మాట‌ల్లోనే.‌.‌.‌

article image
* బాల‌కృష్ణ:‌ ‌‘‌‘ఎని‌మి‌దేళ్ల నుంచి కె.‌ఎస్‌.‌రవి‌కు‌మా‌ర్‌తో కలిసి సినిమా చేయా‌ల‌ను‌కొం‌టున్నా.‌ ఆ కల ఈ సిని‌మాతో నెర‌వే‌రింది.‌ అది కూడా ఈ టైటి‌ల్‌తో సినిమా తెర‌కె‌క్కడం నా పూర్వ జన్మ సుకృ‌తంగా భావి‌స్తున్నా.‌ నాన్న‌గారు నిర్మా‌తగా ‌‘జయ‌సింహ’‌ పేరుతో సినిమా తీసి విజ‌యాన్ని అందు‌కొ‌న్నారు.‌ ఆ పేరుతో ఇప్పుడు నేను సినిమా చేయడం చాలా ఆనం‌దంగా ఉంది.‌ దర్శ‌కు‌లం‌ద‌రితో కలిసి ఒకే తాటి‌మీద ఉంటూ, ఒకే ఉద్దే‌శంతో సినిమా చేస్తుంటా.‌ కె.‌ఎస్‌.‌రవి‌కు‌మా‌ర్‌తో కలిసి పని‌చే‌యడం మరి‌చి‌పో‌లేని అను‌భూతి.‌ అభి‌మా‌నుల నాడిని, నా శైలిని తెలు‌సు‌కొని ఈ చిత్రాన్ని తీశారు.‌ చిరం‌తన్‌ భట్‌ కసిగా పని‌చేసే సంగీత దర్శ‌కుడు.‌ ‌‘కంచె’, ‌‘గౌత‌మి‌పుత్ర శాత‌కర్ణి’‌కి అద్భు‌త‌మైన సంగీ‌తాన్ని ఇచ్చాడు.‌ ఈ సిని‌మాకి కూడా చక్కటి బాణీల్ని, నేపథ్య సంగీ‌తాన్ని అందిం‌చారు.‌ ఎన్టీ‌ఆర్‌ అబ్బాయి అనే ధోర‌ణితో కాకుండా, సెట్‌లో అంద‌రితో కలి‌వి‌డిగా మెలు‌గు‌తుం‌టాను.‌ మాన‌సి‌కంగా నేనె‌ప్ప‌టికీ కుర్రా‌డినే.‌ బాల‌కృష్ణ సంభా‌ష‌ణలు చెప్పా‌డని కాదు.‌.‌.‌ సన్ని‌వే‌శాలు పండ‌క‌పోతే ఏ సినిమా కూడా ఆడదు.‌ ‌‘బ్రహ్మం‌గారి చరిత్ర’‌ సినిమా సమ‌యంలో నేను స్కూల్‌కి వెళ్లే‌వా‌డిని.‌ జీవ‌స‌మాధి తర్వాత వచ్చే సన్ని‌వే‌శాల్లో సమా‌ధి‌కేసి తల‌కొ‌ట్టు‌కొనే ఓ సన్ని‌వేశం ఉంటుంది.‌ అప్పుడు నాన్న‌గారు పిలిచి ‌‘రేయ్‌ ఈ సన్ని‌వే‌శాన్ని నువ్వు పండి‌స్తేనే సినిమా విజ‌య‌వంతం అవు‌తుంది’‌ అన్నారు.‌ సినిమా అంతా ఎన్టీ‌ఆర్‌గారు ఉన్నారు కదా, కొత్తగా నేను పండిం‌చ‌డ‌మే‌మిటి అను‌కొన్నా.‌ కానీ ఆ తర్వాత తెలి‌సింది ఒక సన్ని‌వే‌శా‌నికి అంత ప్రాధాన్యం ఉంటుం‌దని.‌ సిని‌మాలో అన్నీ సంద‌ర్భో‌చి‌తంగా కుది‌రి‌న‌ప్పుడే విజ‌య‌వంతం అవు‌తుంది.‌ ఈ సిని‌మాకి అన్నీ కుది‌రాయి.‌ సంక్రాం‌తికి సకు‌టుంబ సప‌రి‌వార సమే‌తంగా కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం’‌’‌.‌

* కె.‌ఎస్‌.‌రవి‌కు‌మార్‌: ‌‘‌‘బాల‌కృష్ణ గురించి తమి‌ళంలో చాలా‌మంది ‌‘ఆయ‌నకి కోపం ఎక్కువ, ఎలా చేయ‌బో‌తు‌న్నార’‌ని అడి‌గారు.‌ దాంతో మొదట్లో నాక్కూడా కొంచెం భయం ఉండేది.‌ కానీ తర్వాత ఆయ‌నతో జరి‌గిన కథా‌చ‌ర్చ‌ల్లోనూ, చిత్రీ‌క‌ర‌ణ‌లోనూ ఒక్క రోజు కూడా బాల‌కృ‌ష్ణలో కోపం కని‌పిం‌చ‌లేదు.‌ ఆయ‌నతో పోలిస్తే నాకే ఎక్కు‌వగా కోపం వస్తుం‌టుంది.‌ చాలా‌మంది కథా‌నా‌య‌కు‌లతో నేను సిని‌మాలు చేశా.‌ సన్ని‌వేశం చెప్పి‌న‌ప్పుడు ఇదిలా మార్చొచ్చు కదా, బాడీ లాంగ్వేజ్‌ ఇలా పెట్టొ‌చ్చు‌కదా అన్న‌వాళ్లే అంతా.‌ అది తప్పు అని నేను చెప్పను.‌ వాళ్ల ఇమే‌జ్‌కి తగ్గ‌ట్టుగా అడు‌గు‌తుం‌టారు.‌ కానీ నా ప్రయా‌ణంలో ఇద్దరే ఇద్దరు హీరోలు మాత్రం ఏ మార్పు కోర‌లేదు.‌ అందులో అ‌జిత్‌ ఒక‌రైతే, బాల‌కృష్ణ మరొ‌కరు.‌ బాగా పని‌చేస్తే బాల‌కృ‌ష్ణకి కోపం రాదు.‌ ఆయ‌నలో ఎన్నో గొప్ప లక్ష‌ణాలు చూశా.‌ తండ్రిపై ఎంతో ప్రేమని కన‌బ‌రు‌స్తుం‌టారు.‌ ఇంత ప్రేమ పెట్టు‌కొన్న తన‌యు‌డిని ఇప్ప‌టి‌దాకా చూడ‌లేదు.‌ సెట్‌లోనూ ఎంతో చిత్త‌శు‌ద్ధితో పని‌చే‌స్తుం‌టారు.‌ సి.‌కల్యాణ్‌ అద్భు‌త‌మైన నటుల్ని, సాంకే‌తిక బృందాన్ని ఇచ్చారు.‌ తప్ప‌కుండా ఈచిత్రం అంద‌రికీ నచ్చు‌తుంది’‌’‌.

article image
* సి.‌కల్యాణ్‌: ‌‘‌‘పండక్కి సందడి సృష్టిం‌చ‌బో‌తోంది ‌‘జై సింహా’‌.‌ ప్రేమంటే ఎలా ఉండాలో, అభి‌మానం అంటే ఎలా ఉండాలో, గురు‌వును ఎలా గౌర‌విం‌చాలో చెప్పే సినిమా ఇది.‌ కె.‌ఎస్‌.‌రవి‌కు‌మార్‌ దర్శ‌క‌త్వంలో ఓ విభి‌న్న‌మైన సినిమా చేయా‌లని ఉండేది బాల ‌కృ‌ష్ణకి.‌ కానీ ఈ కథని చెప్పి ఒప్పించాం.‌ బాల‌కృష్ణ శైలి మాస్‌ అంశా‌లతో పాటు, కె.‌ఎస్‌.‌రవి‌కు‌మార్‌ శైలి సెంటి‌మెం‌ట్‌ మిళి‌త‌మైన సినిమా ఇది.‌ అను‌కొన్న సమ‌యా‌నికి ప్రేక్ష‌కుల ముందుకు తీసు‌కొ‌చ్చేం‌దుకు చిత్రబృం‌ద‌మంతా అహ‌ర్ని‌శలు శ్రమిం‌చింది.‌ ఈ సిని‌మాని దాసరి నారా‌య‌ణ‌రా‌వు‌గా‌రికి అంకితం చేస్తున్నాం’‌’‌.‌

* వి.‌వి.‌వినా‌యక్‌:‌ ‌‘‌‘జానీ నృత్య దర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ చేసిన పాటని నేను చూశా.‌ సంక్రాం‌తి‌కొ‌స్తున్న ఈ సినిమా విజయం అందు‌కొ‌న్నట్టే.‌ బాల‌కృష్ణ సెట్‌లో చిన్న‌వాళ్ల దగ్గ‌ర్నుంచి, పెద్ద‌వాళ్ల వరకు అంద‌రినీ పల‌క‌రిస్తూ చేర‌దీ‌స్తుం‌టారు.‌ ఆయ‌న‌తో‌ప‌ని‌చే‌యడం మర‌చి‌పో‌లేని అను‌భవం.‌ ‌‘నర‌సిం‌హ‌నా‌యుడు’‌ తర్వాత బిడ్డ సెంటి‌మెం‌ట్‌తో చేసిన మరొక సినిమా ఇది.‌ ఇందు‌లోని కొన్ని సన్ని‌వే‌శాల గురించి విన్నాక కళ్లల్లో నీళ్లు తిరి‌గాయి.‌ నాకు ఇష్ట‌మైన దర్శ‌కుడు కె.‌ఎస్‌.‌రవి‌కు‌మార్‌.‌ ఆయన అద్భు‌తంగా ఈ సిని‌మాని చేశారు.‌ ఇందులో పని‌చే‌సిన అంద‌రికీ నా అభి‌నం‌ద‌నలు’‌’‌.‌

* బోయ‌పాటి శ్రీను:‌ ‌‘‌‘సంగీత దర్శ‌కుడు చిరం‌తన్‌ భట్‌ ‌‘గౌతమి‌పుత్ర శాత‌కర్ణి’‌కి అద్భు‌త‌మైన పాటల్ని ఇచ్చారు.‌ ‌‘జైసింహా’‌కి కూడా మంచి సంగీతం అందిం‌చా‌రని విన్నా.‌ ‌‘నర‌సింహ’‌ తీసిన దర్శ‌కుడే ఈచి‌త్రాన్ని తీశాడు.‌ ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిం‌చా‌లని కోరు‌కొం‌టున్నా.‌ బాల‌కృ‌ష్ణతో తదు‌పరి సినిమా చేస్తున్నా.‌ ఒక సిని‌మాని ఒప్పు‌కొ‌న్నాక కసితో నిల‌బ‌డ‌తాడు, చిత్రాన్ని నిల‌బె‌డ‌తాడు.‌ సంక్రాంతి సీజ‌న్‌లో వస్తున్న ప్రతి సినిమా విజ‌య‌వంతం కావా‌లని కోరు‌కొం‌టున్నా’‌’‌.‌

* చిరం‌తన్‌ భట్‌:‌ ‌‘‌‘బాల‌కృ‌ష్ణతో ఇది నా రెండో సిసి‌నిమా.‌ ఎంతో స్నేహంగా ఉంటారు.‌ ఆయ‌నతో కలిసి మళ్లీ మళ్లీ పని‌చే‌యా‌లని ఉంది.‌ ఒక తండ్రి‌లాగా వ్యక్తి‌గ‌తంగా కూడా ఎన్నో సల‌హాలు ఇచ్చారు దర్శ‌కుడు.‌ ఈ సినిమా ప్రయా‌ణంలో ఆయ‌న్నుంచి ఎన్నో విష‌యాలు నేర్చు‌కొన్నా.‌ రామ‌జో‌గ‌య్య‌శా‌స్త్రి, భాస్క‌ర‌భట్ల, శ్రీమణి చక్కటి సాహిత్యం అందిం‌చారు.‌ యాక్షన్, డ్రామా, భావో‌ద్వే‌గా‌లతో ఈ సినిమా నవ్వి‌స్తుంది, ఏడి‌పి‌స్తుంది.‌ అంద‌రికీ నచ్చే ఓ మంచి చిత్రమ‌వు‌తుంది’‌’‌.‌

ఈ కార్య‌క్రమంలో బ్రహ్మా‌నందం, వి.‌ఆనం‌ద్‌ ప్రసాద్, జి.‌ఆది‌శే‌ష‌గిరి రావు, టి.‌ ప్రస‌న్న‌ కు‌మార్, జెమిని కిరణ్, కె.‌ఎస్‌.‌రామా‌రావు, సత్తె రంగయ్య, వీరి‌నా‌యుడు, ముత్యాల రాందాసు, ప్రస‌న్న‌కు‌మార్, కె.‌అశో‌క్‌కు‌మార్, ఎన్వీ రెడ్డి, బోస్, వి.‌సాగర్, రామ‌స‌త్య‌నా‌రా‌యణ, రాంప్రసాద్, సత్య‌నా‌రా‌య‌ణ‌రెడ్డి, ప్రసాద్, భాస్క‌ర‌భట్ల రవి‌కు‌మార్, జానీ, రత్నం, శివ‌లెంక కృష్ణ‌ప్రసాద్, జయ‌ప్రకా‌ష్‌రెడ్డి, రామ‌జో‌గయ్య శాస్త్రి, దువ్వాసి మోహన్, శరత్, రామ్‌లక్ష్మణ్‌ తది‌త‌రులు పాల్గొ‌న్నారు.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.