ఎన్టీఆర్‌ అభిమాని కాని తెలుగువాడే లేడు
తెలుగు వారికే కాదు.‌.‌.‌ ప్రతి ఒక్క‌రికీ స్ఫూర్తి‌దా‌యకం నంద‌మూరి తారక రామా‌రావు జీవిత చరిత్ర.‌ ఆ చరి‌త్రని వెండి తెరపై తీసు‌కొచ్చే ప్రయ‌త్నంలో పడ్డారు తన‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ.‌ వారాహి చలన చిత్రం, ఎన్‌బికె ఫిలింస్‌ సంయు‌క్తంగా తెర‌కె‌క్కి‌స్తు‌న్నాయి.‌ బాల‌కృష్ణ నిర్మాత.‌ తేజ దర్శ‌కత్వం వహి‌స్తు‌న్నారు.‌ మార్చి 29న హైద‌రా‌బాద్‌ నాచా‌రం‌లోని రామ‌కృష్ణ హార్టి‌క‌ల్చ‌రల్‌ స్టుడి‌యో‌స్‌లో ‌‘ఎన్టీ‌ఆర్‌’‌ ప్రారం‌భో‌త్సవం అత్యంత అట్ట‌హా‌సంగా జరి‌గింది.‌ ముఖ్య‌అ‌తి‌థిగా విచ్చే‌సిన భారత ఉప‌రా‌ష్ట్రపతి ఎం.‌ వెంక‌య్య‌నా‌యుడు తొలి సన్ని‌వే‌శా‌నికి క్లాప్‌ ఇచ్చారు.‌ తెలం‌గాణ సిని‌మా‌టో‌గ్రఫీ మంత్రి తల‌సాని శ్రీని‌వాస్‌ యాదవ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.‌ దర్శ‌కులు కె.‌ రాఘ‌వేం‌ద్రరావు, బోయ‌పాటి శ్రీను గౌరవ దర్శ‌కత్వం వహిం‌చారు.‌ నంద‌మూరి మోహ‌న‌కృష్ణ చిత్రబృం‌దా‌నికి స్క్రిప్టును అందిం‌చారు.‌ ఈసం‌ద‌ర్భంగా జరి‌గిన సమా‌వే‌శంలో అతి‌థులు ఏమ‌న్నా‌రంటే.‌.‌.‌

article image
వెం‌క‌య్య‌నా‌యుడు:‌
‌‘‌‘తెలు‌గు‌ద‌నా‌నికి నిండు‌దనం, తేజాన్ని, ప్రపం‌చ‌వ్యాప్త గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్‌.‌టి.‌ఆర్‌.‌ రాష్ట్రప‌తులు, ఉప‌రా‌ష్ట్రప‌తులు ఇలాంటి కార్య‌క్రమా‌లకు రాకూ‌డ‌దనే నిబం‌ధ‌నల మాటెలా ఉన్నా, ఎన్‌.‌టి.‌ఆర్‌పై నాకు ఉన్న అభి‌మానం, గౌర‌వంతో ఈ కార్య‌క్రమా‌నికి వచ్చాను.‌ చరి‌త్రలో నిలి‌చి‌పోయే చరిత్ర ఎన్‌.‌టి.‌ఆర్‌ది.‌ ఆ పాత్రలో తన‌యు‌డైన బాల‌కృష్ణ నటిం‌చడం తెలుగు చల‌న‌చిత్ర చరి‌త్రలోనే చరిత్ర.‌ శ్రీకృ‌ష్ణుడు, శ్రీరా‌ముడు ఎవ‌రంటే ఎన్‌.‌టి.‌ఆర్‌యే అన్నం‌తగా ప్రజల్లో నిలి‌చా‌రా‌యన.‌ ఎన్టీ‌ఆర్‌ అభి‌మాని కాని తెలు‌గు‌వాడే లేడు.‌ ఆయన నటన, రాజ‌కీయం, తెలు‌గు‌భా‌షకి ఓ దర్పం, హోదా, గౌరవం తెచ్చి‌న‌పె‌ట్టారు.‌ ఆయ‌నపై గౌర‌వంతో ప్రతి ఒక్కరం తెలు‌గు‌లోనే మాట్లా‌డాలి.‌ తెలుగు సంస్కృ‌తిని ఆచ‌రిం‌చాలి.‌ తెలుగు జాతిపై భక్తిని కలిగి ఉండాలి.‌ తెలుగు భాష, సంస్కృ‌తిని కాపా‌డు ‌కో‌డా‌నికి మనం ఎన్‌.‌టి.‌ఆర్‌ని స్ఫూర్తిగా తీసు‌కో‌వాలి.‌ తండ్రి చూపిన బాట‌లోనే ఆయన వార‌స‌త్వాన్ని పుణి‌కి‌పు‌చ్చు‌కుని నడు‌స్తోన్న బాల‌కృ‌ష్ణకి ఈ సినిమా విజ‌యాన్ని అందిం‌చాలి.‌ ఎన్‌.‌టి.‌ఆర్‌.‌చరిత్ర గుర్తుం‌డి‌పో‌యేలా చరి‌త్రలో నిలి‌చి‌పో‌వాలి’‌’‌

article image
కె.‌రాఘ‌వేం‌ద్రరావు:‌
‌‘‌‘ఎన్‌.‌టి.‌ఆర్‌.‌తో సినిమా చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం.‌ ఆయన చరి‌త్రని తెర‌కె‌క్కి‌స్తోన్న బాల‌కృష్ణ ధన్యుడు.‌ దర్శ‌కత్వం చేస్తున్న తేజ అదృ‌ష్ట‌వం‌తుడు.‌ అయితే ఈ సిని‌మా‌లోని ఒక్క షాటైనా దర్శ‌కత్వం చేసే అవ‌కా‌శాన్ని నాకు ఇవ్వా‌లని కోరు‌కుం‌టు‌న్నాను’‌’‌

అల్లు అర‌వింద్‌:
‌‘‌‘ఒక‌ప్పుడు ఉత్త‌రా‌దిన మన‌మం‌ద‌రినీ మద‌రా‌సీలు అనే‌వారు.‌ మేమంతా మద‌రా‌సీలు కాదురా తెలు‌గోళ్లం అని ఎన్టీ‌ఆర్‌ చాటి చెప్పారు.‌ అప్ప‌ట్నుంచీ మనం తెలు‌గు‌వాళ్లం అయ్యాం.‌ ఆయన చరి‌త్రను అద్భు‌తంగా తెర‌కె‌క్కించే సాహసం చేస్తోన్న బాల‌కృష్ణ దమ్మున్న మనిషి.‌ రెండు‌న్నర ఏళ్ల కిందటే ఎన్టీ‌ఆర్‌ చరి‌త్రను తీయా‌ల‌నుం‌దని విష్ణు నాకు చెప్పి‌న‌ప్పుడు అందుకు బాల‌కృష్ణ ఒక్కరే సరి అన్నా’‌’
తేజ:‌
‌‘‌‘ఈ అవ‌కాశం వస్తుం‌దని కలలో కూడా అను‌కో‌లేదు.‌ నన్ను డైరెక్ట్‌ చేయ‌మ‌న్న‌ప్పుడు ‌‘నేను సరైన వ్యక్తి కాదేమో’‌ అన్నాను.‌ నన్నే చేయ‌మ‌న్నారు.‌ అలా ఆ అదృష్టం దక్కింది.‌ తెరపై బాగా చూపిం‌చ‌డా‌నికి కృషి చేస్తాను.‌ ఇది నేను రాసిన కథ కాదు.‌ చరిత్ర.‌ దీనిని ఒకటి కాదు ఆరు సిని‌మా‌లుగా తీయొచ్చు.‌ దసరా కాను‌కగా విడు‌దల చేయా‌ల‌ను‌కుం‌టున్నాం’‌’‌

బాల‌కృష్ణ:‌
‌‘‌‘నాకు తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే.‌ ఎన్టీ‌ఆర్‌ అనే మాటే ఓ హృదయ స్పందన.‌ మహా‌ను ‌భా‌వులు అంటే సామా‌న్యులు కారు.‌ శంక‌రా‌చా‌ర్యులు, రామా‌ను‌జా‌చా‌ర్యులు, అంబే‌ద్కర్, గాంధీ.‌.‌ఎలానో ఎన్టీ‌ఆర్‌ కూడా అలానే.‌ పేద‌వారి ఆరా‌ధ్య‌దైవం ఆయన.‌ కళ సమాజం కోసం అని చాటారు.‌ తెలు‌గు‌వారి ఆత్మ‌గౌ‌ర‌వాన్ని కాపా‌డారు.‌ ఎలాంటి పరి‌స్థి‌తు‌ల్లోనూ తల‌వొం‌చక దైర్యంగా సాగిన థీశాలి.‌ ఎన్‌ అంటే నట‌నా‌లయం.‌ టి అంటే తారా‌మం‌డ‌లం‌లోని తార.‌ ఆర్‌ అంటే రాజర్షి అని నా విశ్లే‌షణ.‌ తెలుగు భాషకి గుర్తింపు తెచ్చారు.‌ రాజ‌కీ‌యాల్లో మార్పులు తీసు‌ కొ‌చ్చారు.‌ అలాంటి చరి‌త్రని వెండి‌తె‌రపై చూపా‌లనే ఆలో‌చ‌నను విష్ణు నాతో పంచు‌కు‌న్నారు.‌ ఆయన జీవిత చరిత్ర శాశ్వ‌తంగా నిలి‌చి‌పో‌వా‌లనే ఆకాం‌క్షతో ఇలా రంగం‌లోకి దిగాం.‌ తొంద‌ర‌పాటు లేకుండా కథ, స్క్రీన్‌ప్లేని తీర్చాం.‌ విష్ణు‌వ‌ర్ధన్, శ్రీనాథ్‌ కథ విష‌యంలో సాయం చేశారు.‌ ఎన్టీ‌ఆర్‌ మాటలే మనకి విని‌పిం‌చేలా బుర్రా సాయి‌మా‌ధవ్‌ సంభా‌ష‌ణ‌లను సమ‌కూ‌ర్చారు.‌ ఆహ్లాదం, మనో‌రం‌జ‌క‌మైన స్వర‌క‌ల్ప‌నను గావి‌స్తు‌న్నారు కీర‌వాణి.‌ ఇక ఎన్టీ‌ఆర్‌ ‌‘పాతా‌ళ‌భై‌రవి’‌ చిత్రం ముందు మార్చి 25న విడు‌ద‌లైనా, పెరి‌గిన ప్రింట్లుతో మార్చి 29న మళ్లీ విడు‌దలై విశే‌ష‌మైన ప్రేక్ష‌కా‌ద‌రణ పొందింది.‌ ‌‘లవ‌కుశ’‌ కూడా మార్చి 29నే విడు‌దలై విజయం సాధిం‌చింది.‌ ఎన్టీ‌ఆర్‌ నటిం‌చిన రంగుల చిత్రం ‌‘వంశో‌ద్ధా‌ర‌కుడు’‌ కూడా ఇదే నెల ఇదే రోజున ప్రేక్ష‌కు‌ల్లోకి వెళ్లింది.‌ నేను నటిం‌చిన ‌‘తాత‌మ్మ‌కల’‌ షూటింగు ఈరో‌జునే రామ‌కృష్ణ స్టుడి‌యోలో ఆరం‌భ‌మైంది.‌ వీట‌న్ని‌టినీ మించి ప్రజల కోసం నాన్న‌గారు సృష్టిం‌చిన తెలు‌గు‌దేశం పార్టీ ఆవి‌ర్భావం కూడా మార్చి 29నే.‌ అందుకే ఇదే రోజు ‌‘ఎన్‌.‌టి.‌ఆర్‌’‌ చిత్రాన్ని ఆరం‌భించాం’‌’‌

జమున:‌
‌‘‌‘సాంఘిక, పౌరా‌ణిక, చారి‌త్రా‌త్మక పాత్రల్లో ఎన్టీ‌ఆర్‌ చేయని పాత్రంటూ లేదు.‌ రాజ‌కీయ రంగంలో చేసిన సాహ‌సాలు అనేకం.‌ ఆయ‌నతో చాలా సిని‌మాల్లో నటిం‌చిన అదృష్టం నాది.‌ నాకు ఇష్ట‌మైన ఏకైక కథా‌నా‌య‌కుడు ఆయనే.‌ ఇప్పుడు బాల‌కృ‌ష్ణని చూస్తుంటే ఎన్టీ‌ఆర్‌యే కని‌పి‌స్తు‌న్నారు.‌ బాల‌కృష్ణ ‌‘అక్బర్‌ సలీమ్‌ అనా‌ర్కలి’‌లో నటించా.‌ చరి‌త్రలో నిలి‌చి‌పోయే ఈ చిత్రం విజయం సాధిం‌చా‌లని కోరు‌కుం‌టు‌న్నాను’‌’‌

బుర్రా సాయి‌మా‌ధవ్‌:‌
‌‘‌‘ఒక జాతిని, రాష్ట్రాన్ని, దేశాన్నీ నడి‌పిం‌చిన వ్యక్తి ఎన్టీ‌ఆర్‌.‌ ఆయన వల్లే నేనీ స్థాయిలో ఉన్నా.‌ ఆయన చిత్రా‌నికి మాటలు రాయడం నేను చేసు‌కున్న పుణ్యం.‌ వరం.‌ ప్రతీ అక్షరం నా ఆయు‌ష్షుని పెంచేలా రాస్తా’‌’‌

పరు‌చూరి వెంక‌టే‌శ్వ‌ర‌రావు:‌
‌‘‌‘మా అన్న‌ద‌మ్ము‌లకి పరు‌చూరి బ్రదర్స్‌ నామ‌క‌రణం చేసింది ఎన్టీ‌ఆరే.‌ ఆయ‌నతో ‌‘నాదేశం’, ‌‘మేజర్‌ చంద్రకాంê’‌Â సిని‌మాల నుంచీ మా ప్రయాణం 16 సంవ‌త్స‌రాలు సాగింది.‌ తండ్రి బయో‌పి‌క్‌ని బాల‌కృష్ణ తీసి రుణం తీర్చు‌కుం‌టు‌న్నారు’‌’‌

సింగీతం శ్రీని‌వా‌స‌రావు:‌
‌‘‌‘మాయా‌బ‌జార్‌ చిత్రా‌నికి అసి‌స్టెం‌ట్‌గా చేశా.‌ అప్పుడు ఆయన శ్రీకృ‌ష్ణుడు గెట‌ప్‌లో సెట్లోకి అడు‌గు‌పె‌ట్టారు.‌ చూడ్డా‌నికి చిత్రబృందం ఎగ‌బ‌డ్డారు.‌ నేనేమో ఎగి‌రె‌గిరి ఎన్టీ‌ఆర్‌ను చూసే ప్రయత్నం చేశా.‌ ఆయన నడుస్తూ స్పాట్‌త దగ్గ‌రకి రాగానే ఆయన్ని చూసే భాగ్యం దక్కింది.‌ ఆ రూపాన్ని చూసి తన్మ‌య‌త్వంతో రెండు చేతులు పైకి ఎత్తి దండం పెట్టా.‌ అలానే కొన్ని నిమి‌షాలు ఉండి‌పోయా.‌ ఆ సమ‌యంలో ఆయన నన్ను గమ‌నిం‌చారు.‌ ‌‘శ్రీకృష్ణ పాండ‌వీయం’‌ సమ‌యంలో ఎన్టీ‌ఆర్‌ నన్ను పిలిచి స్క్రిప్టు విని‌పిం‌చారు.‌ ఎలా ఉందని అడి‌గారు.‌ ‌‘ఈ సినిమా చూడా‌లన్న తొందర నాలో మొద‌లైంద’‌న్నాను.‌ ఈ మాట గుర్తు‌పె‌ట్టు‌కుని రెండేళ్ల తర్వాత ‌‘శ్రీకృ‌ష్ణ‌పాం‌డ‌వీయం’‌ విడు‌దల సమ‌యంలో వేసిన ప్రత్యేక ఆటకి నన్ను ఆహ్వా‌నిం‌చారు.‌ నా భార్యతో కలిసి వెళ్లా.‌ కేవలం నా కోసమే ఆ ప్రద‌ర్శన ఏర్పాటు చేయడం ఆశ్చ‌ర్యా‌నికి గురి చేసింది.‌ ఓ అసి‌స్టెంట్‌ అని చూడ‌కుండా గౌర‌విం‌చిన ఆయన సహృ‌ద‌య‌తకి నమ‌స్కారం’‌’‌.‌

article image
ఈ కార్య‌క్రమంలో కోడి రామ‌కృష్ణ, కోదం‌డ‌రా‌మి‌రెడ్ది, ఎస్వీ కృష్ణా‌రెడ్డి, కె.‌ఎస్‌.‌ రవి‌కు‌మార్, కైకాల సత్య‌నా‌రా‌యణ, దగ్గు‌బాటి పురం‌ధే‌శ్వరి, జెమిని కిరణ్, పూరి జగ‌న్నాధ్, డి.‌ సురే‌ష్‌బాబు, రాజ‌శే‌ఖర్, జీవిత, విష్ణు ఇందూరి సాయి కొర్రపాటి, ఎం.‌ఎం.‌ కీర‌వాణి, నంద‌మూరి కుటుం‌బ‌స‌భ్యులు పాల్గొ‌న్నారు.‌ ఈ చిత్రా‌నికి కథ:‌ ఎల్‌.‌ శ్రీనాధ్‌−‌ విష్ణు‌వ‌ర్ధన్‌ ఇందూరి, ఛాయా‌గ్రహణం:‌ సంతోష్‌ తుండి‌యిల్, మాటలు:‌ బుర్రా సాయి‌మా‌ధవ్, కూర్పు:‌ కోట‌గిరి వెంక‌టే‌శ్వ‌ర‌రావు, సహ‌ని‌ర్మా‌తలు:‌ సాయి‌కొ‌ర్రపాటి, విష్ణు‌వ‌ర్ధన్‌ ఇందూరి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.