ఆ వయసులో..


నిఖిల్‌ దేవాదుల, కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్, సానియా, పారుల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘15-18-24 లవ్‌స్టోరీ’. మాడుపూరి కిరణ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి ప్రసాద్, కిరణ్‌ కుమార్‌ నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమ మీద వయసు ప్రభావం ఎలా ఉంటుందో తెలిపే చిత్రమిది. 15 ఏళ్ల నుంచి 24 వరకు మూడు దశల్లో సాగే ఈ కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. కథ రీత్యా కులుమనాలి, గోవా, ఒంగోలు, కేరళతోపాటు, రామోజీ ఫిలిం సిటీలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ నేతృత్వంలో ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించాం. ఇటీవలే సినిమాకి సంబంధించిన రెండో ప్రచార చిత్రాన్ని బీజేపీ నాయకులు బంగారు బాబు విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.