కనుల పంట.. నితిన్‌-షాలిని జంట
టాలీవుడ్‌ యువ కథానాయకుడు నితిన్‌ ఓ ఇంటి వాడవుతున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు షాలినిని వివాహమాడుతున్నాడు. ఏప్రిల్‌ 16న ఏడడుగులు వేయబోతుంది ఈ జంట. శనివారం శుభ ముహూర్తాన పెళ్లి పనులు ప్రారంభించారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు నితిన్‌. ఈ కార్యక్రమంలోని రెండు ఫొటోలు షేర్‌ చేశాడు. నితిన్‌-షాలినిల జంట చూడచక్కగా ఉంది. సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘‘ పెళ్లి పనులు మొదలయ్యాయి. మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అంటూ నితిన్‌ ట్వీట్‌ చేశాడు. ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వధూవరులు కాబోతున్న ఈ జోడిని మీరూ చూడండి...


సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.