త్రివిక్రమ్‌ చేతుల మీదుగా ‘ఓ పిట్టకథ’

విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకుడు. వి.ఆనంద ప్రసాద్‌ నిర్మాత. టైటిల్‌ లోగోని, పోస్టర్‌ని దర్శకుడు త్రివిక్రమ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కథ విన్నాను. ఆసక్తికరంగా అనిపించింది. టైటిల్‌ గురించి చర్చ వచ్చినప్పుడు దర్శకుడు చెందు మూడు పేర్లు చెప్పారు. అందులో ‘ఓ పిట్టకథ’ నాకు బాగా నచ్చింది. ‘ఇట్స్‌ ఏ లాంగ్‌ స్టోరీ’ అనే క్యాప్షన్‌ పెట్టమని నేను సలహా ఇచ్చాన’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘చెందు చెప్పిన కథ మాకు నచ్చింది. అందుకే వెంటనే పట్టాలెక్కించాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రతి సన్నివేశం స్వచ్ఛంగా ఉంటుంది. తరవాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠనూ రేకెత్తిస్తుంద’’న్నారు. పాటలు: శ్రీజో, కళ: వివేక్‌ అన్నామలై, ఛాయాగ్రహణం: సునీల్‌ కుమార్, సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అన్నే రవి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.