ఓ మౌన ప్రేమ కథ

కార్తీక్, పార్వతి అరుణ్‌ జంటగా నటించిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. కళాదర్శకుడు అశోక్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆశా అశోక్‌ నిర్మాత. ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో కథానాయకుడు మాట్లాడుతూ ‘‘యువతను అలరించే వినూత్నమైన ప్రేమకథాచిత్రమిది’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈతరం ఆలోచనలకి అనుగుణంగా ఈ ప్రేమకథని తయారు చేశా. హృదయాల్ని కదిలించే సహజసిద్ధమైన పాత్రలతో ఆకట్టుకునేట్టు మలిచాను. నాలుగు పాటలున్నాయి. ఆడియోకి చక్కటి స్పందన లభించింది. నాజర్‌ పాత్ర అందరికీ బాగా నచ్చుతుంది. దర్శకుడిగా నా తొలి ప్రయత్నం ఫలిస్తుందనే నమ్మకం ఉంద’’న్నారు. సంభాషణల రచయిత సురేష్‌ గణపర్తి మాట్లాడుతూ ‘‘ప్రేమని ఒకరితో ఒకరు పంచుకోవాలి. అలా పంచుకోకపోవడం వల్ల ఓ జంటకు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని ఓ చక్కటి సంఘర్షణతో కొత్తకోణంలో దర్శకుడు చిత్రించడం విశేషమ’’న్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.