గీతాలాపనలో ‘పాగల్‌’

విశ్వక్‌సేన్‌ కథానాయకుడుగా ‘పాగల్‌’ చిత్రం తెరకెక్కుతుంది. నివేదా పేతురాజ్‌ నాయిక. నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పుదుచ్చేరిలో జరుగుతుంది. శుక్రవారం అక్కడి అందమైన ప్రదేశాల్లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సంబంధిత ఫొటోని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది చిత్రబృందం. ఇందులో కొందరు బృంద సభ్యులతోపాటు విశ్వక్‌ ప్రివ్యూ చూస్తూ కనిపిస్తున్నాడు. కథానాయిక దర్శనమివ్వకపోవడంతో ఇది సోలో సాంగ్‌ అని అర్థమవుతుంది. బహుశా హీరో పరిచయ గీతమేమో! ఈ చిత్రానికి రథన్‌ సంగీతం అందిస్తున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణు గోపాల్‌ నిర్మిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.