‘ప్లానింగ్‌’ పాటలొచ్చేశాయి

అధర్వ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కిన ‘సెమ్మ బొథ ఆగతే’ తెలుగులో ‘ధనమ్‌ మూలమ్‌’ పేరుతో విడుదల కాబోతోంది. ‘కిక్కు ఎక్కిపోయెరా...’ అనేది ఉపశీర్షిక. మిస్తీ చక్రవర్తి కథానాయిక. బద్రి వెంకటేష్‌ దర్శకత్వం వహించారు. రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మాత. ఈ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సహ నిర్మాత జె.వి.రామారావు మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. కథలో ప్రమాదం నేపథ్యం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అధర్వకి ప్రేయసిగా మిస్తీ చక్రవర్తి, వేశ్యగా అనైక శోఠి అభినయం మెప్పిస్తుంది’’ అన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.