‘పోయే ఏనుగు పో’

ఓ ఏనుగు... కొంత మంది చిన్నారుల మధ్య నడిచే ఓ చక్కటి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘పోయే ఏనుగు పో’. కె.వి.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.రాజేంద్రన్‌ నిర్మాత. ఇది తమిళంలో ‘పో యానైకుట్టియే’ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు టైటిల్‌ లోగో, బేనర్‌ లోగోను ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా పేరు కొత్తగా ఉంది. దర్శకుడు మంచి కథ, మాటలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఏనుగు, చిన్న పిల్లల మధ్య సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే మంచి కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు నిర్మాత. సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కథ: ఎస్‌. అరవింద్‌ కేశవన్, ఛాయాగ్రహణం: అమర్‌.జి.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.