పునర్నవి భూపాలం, మహత్ రాఘవేంద్ర ,శ్వేతావర్మ, సూర్యభరత్ చంద్ర ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం సైకిల్. ఆట్ల అర్జున్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని పి.రాంప్రసాద్ వి.బాలాజీరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది . ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అర్జున్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తర భారత దేశంలోని కొన్ని వింత యధార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ, సంక్రాంతికి కుటుంబం అంతా కలిసి చూసి ఆనందించే చిత్రం అవుతుందని చెప్పారు. ఇంకా చిత్రంలో అనితా చౌదరి, మధుమని, సుదర్శన్, నవీన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటించారు. ఇంత పెద్ద కాంపిటేషన్ లోకూడా మా చిత్రం ఖచ్చితంగా వైవిధ్య చిత్రం అవుతోందని ధీమా వ్యక్తం చేసారు.