దాసరి మాటకు.. రామ్‌ బాసట తోడైన వేళ..

సెప్టెంబరు 28 పూరి జగన్నాథ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దర్శకత్వ శాఖలో పనిచేసి, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 30 మందికి చెరో 50 వేల రూపాయల చొప్పున ఆర్థిన సహాయం అందజేశారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛార్మి మాట్లాడుతూ ‘‘ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుగారు ‘నా వారసుడివి నువ్వే’ అని ఓ సందర్భంలో పూరి జగన్నాథ్‌ని మెచ్చుకున్నారు. దాసరి ఓ లెజెండ్‌. ఆయన వారసత్వం సినిమాలకు మాత్రమే పరిమితం చేయకూడదు. సామాజిక సేవలోనూ ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. ఆ రోజు దాసరి గారు చెప్పిన మాటకు ఇప్పుడు రామ్‌ ప్రోత్సాహం కూడా తోడైంది. రామ్‌ లేకపోతే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లేదు. ఆ సినిమా ఆర్థికంగా మంచి విజయం సాధించడంతోనే కొంతమందికైనా సహాయం చేయగలగుతున్నాం. ఈ కార్యక్రమం మున్ముందు కూడా కొనసాగుతుంద’’న్నారు. ఈ కార్యక్రమంలో కాశీవిశ్వనాథ్, ఉత్తేజ్, రామ్‌ప్రసాద్, సుబ్బారెడ్డి, ఆదుర్తి రమణ తదితరులు పాల్గొన్నారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.