ఈరోజు నటుడిగా పుట్టాను
‘‘పుట్టిన రోజు జరుపుకోవడం అంటే నాకు చాలా చిరాకు. కానీ ఈయేడు నేను నటుడిగా పుట్టాను. అందుకే వేడుక చేసుకుంటున్నా’’ అన్నారు రాంగోపాల్‌ వర్మ. ఆయన తొలిసారి నటిస్తున్న చిత్రం ‘కోబ్రా’. వర్మ, ఆగస్త్య మంజు దర్శకులు. డీపీఆర్‌ నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌లో ‘కోబ్రా’ ఫస్ట్‌లుక్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ‘‘కోబ్రా స్క్రిప్టు రాస్తున్నప్పుడు కొత్తరకమైన ఇంటిలిజెంట్‌ ఆఫీసర్‌ పాత్రలో నేనే నటిస్తే బాగుంటుందనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ‘క్షణం క్షణం’ పాటలంటే నాకు చాలా ఇష్టం. దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తరవాత కీరవాణితో పనిచేయడం ఆనందంగా ఉంద’’న్నారు. ‘‘నటుడిగా వర్మకు ఇదో సవాల్‌.ఎందుకంటే మనమంతా నిజ జీవితంలో అప్పుడప్పుడూ నటిస్తూనే ఉంటాం. కానీ వర్మ తొలిసారి తెరపై నటించబోతున్నారు. సంగీత దర్శకుడిగా ‘కోబ్రా’లో నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారన్న నమ్మకం ఉంద’’న్నారు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.