ఆత్మహత్య చేసుకుంటారా?

శివ రామచంద్రవరపు, ప్రవీణ్‌ యండమూరి, సాకేత్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సూసైడ్‌ క్లబ్‌’. శ్రీనివాస్‌ బొగడపాటి దర్శకుడు. ప్రవీణ్‌ ప్రభు మల్లేశం నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్‌ చాలా బాగుంది. స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఈతరం దర్శకులు సరికొత్త ఆలోచనలతో వస్తున్నారు. ఆ లక్షణాలు ఈ ప్రచార చిత్రంలో ఉన్నాయ’’న్నారు. ‘‘ఆత్మహత్యల నేపథ్యంలో సాగే కథ ఇది. టైటిల్‌ లానే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు నిర్మాత.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.