వాస్తవ సంఘటనలతో ‘విఠల్‌ వాడి’రోహిత్, కైషా రావత్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘విఠల్‌ వాడి’. టి.నాగేందర్‌ దర్శకుడు. జి.నరేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 20న చిత్ర వస్తోంది. గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది చిత్ర బృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నిర్మాత నరేష్‌ చెప్పిన ఓ కథాంశాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హీరో కొత్తవాడైనా అనుభవమున్న నటుడిలా చేశాడు’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిద’’న్నారు రోహిత్‌. ‘‘ఓ మంచి ప్రేమకథతో వినోదాత్మకంగా రూపొందించారు. నాకింత మంచి పాత్ర ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అంది కైషా. నిర్మాత మాట్లాడుతూ ‘‘సహజమైన కథాకథనాలతో సాగే చిత్రమిది. రోహిత్‌ నటన చిత్రానికి ప్రధాన బలం. సంగీతం, ఛాయాగ్రహణం బాగా కుదిరాయి’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.