ప్రేమ మనిషిని మార్చేస్తుంది

‘‘ప్రేమ, రొమాన్స్‌ జీవితంలో అంతర్భాగం. కాబట్టి ప్రతి క్రైమ్‌ వెనుక ఓ ప్రేమ దాగి ఉంటుంది. ప్రేమ కోసం కొందరు తప్పులు చేస్తారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇందుకు ఓ కారణం. అదెలా అనేది మా సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు పి. సునీల్‌కుమార్‌ రెడ్డి. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘రొమాంటిక్‌ క్రిమినల్స్‌’. యెక్కలి రవీంద్రబాబు, బాపిరాజు నిర్మాతలు. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో పి.సునీల్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రేమ కూడా వ్యసనమే. ఆ మాయలో పడి కొందరు క్రిమినల్స్‌గా మారిపోతున్నారు. యువత ఇబ్బందుల్ని, వాళ్లు చేసే తప్పుల్ని చెప్పే ప్రయత్నమిది. తల్లిదండ్రులకు చెంపపెట్టులాంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి. రొమాన్స్‌ మోతాదు మించదు. నాలుగు పాటలూ కథానుగుణంగానే వస్తాయి. నా సినిమాలన్నీ సమాజానికి ఏదో చెప్పాలనే తపనతోనే తెరకెక్కుతాయి. కేవలం రామానాయుడుగారు అడిగారనే ‘నేనేం చిన్నపిల్లనా’ సినిమాని తీశాను. ఆ తరవాత తొలిసారి బయటి నిర్మాతతో ‘సీతారామరాజు’ తెరకెక్కిస్తున్నా. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కుతుంద’’న్నారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.