స్కూల్‌ లవ్‌ ఫెయిల్‌.. ఆమె చాలా డేంజరస్‌

‘‘96 చిత్రంలోని పాత్రలు మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో తగిలినట్లుగానే ఉంటాయ’’న్నారు శర్వానంద్‌. ఆయన కథానాయకుడిగా సమంతతో కలిసి నటించిన చిత్రం ‘జాను’. తమిళ హిట్‌ చిత్రం ‘96’కు రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్‌ చేశారు. దిల్‌రాజు నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో శర్వా మాట్లాడుతూ ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘‘స్కూల్‌ డేస్‌లో పుట్టే ప్రేమ 99శాతం విఫలమవుతుంది. ఈ చిత్రం స్కూల్‌ డేస్‌ను గుర్తుకు తెచ్చే విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో నేను ఎంతో బాగా నటించాను అంటే అదంతా సమంత క్రెడిట్టే. ఆమె వల్లే నా పాత్ర బాగా వచ్చింది. నిజానికి ఆమె చాలా డేంజరస్‌. సాధారణంగా కొంతమంది హీరోలకు కొందరు నాయికలతో చేయడం కష్టంగా ఉంటుంది. నిత్యమేనన్‌, సాయిపల్లవి, సమంత లాంటి వారితో నటించడం అంటే ఏ హీరోకైనా కష్టమే. వారిని క్రాస్‌ చెయ్యడం కష్టం. అందుకే కనీసం వాళ్లతో బ్యాలన్స్‌ చెయ్యడానికైనా ప్రయత్నించాలి. దీనికోసమైనా కష్టపడాల్సి ఉంటుంది. నేను ఈ చిత్ర విషయంలో అలాంటి కష్టం చూశాను. సామ్‌ ఇప్పటికీ తాను చేస్తున్నది తొలి చిత్రమే అన్నట్లుగా కష్టపడి చేస్తుంది’’ అని చెప్పుకొచ్చారు శర్వా.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.