త్వరలోనే ‘బొమ్మ అదిరింది’

షకలక శంర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’. ప్రియ కథానాయిక. కుమార్‌ కోట దర్శకత్వం వహిస్తున్నారు. లుకాలపు మధు, సోమేశ్‌ ముచ్చర్ల నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని ఇటీవల కథానాయిక ప్రగ్యా జైస్వాల్‌ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘షకలక శంకర్‌ మార్క్‌ వినోదంతో, యువతరాన్ని ఆకట్టుకునే అంశాలతో రూపొందించిన చిత్రమిది. ఇందులోని బొమ్మ కథేమిటి? ఎవరికి దిమ్మ తిరిగిందనే విషయాలు ఆసక్తికరం. ఈ నెలాఖరులోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు. ఈ చిత్రంలో అర్జున్‌ కల్యాణ్‌, రాజ్‌ స్వరూప్‌, మధు, స్వాతి తదితరులు నటిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.