వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం

ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంట పెళ్లి బాజా మోగింది. ఆయన చిన్న కుమారుడు, నటుడు రాజా (రాజా భవాని శంకర శర్మ) వివాహం వైభవంగా జరిగింది. 2020 అక్టోబరు 31న ఉదయం గం.10:55ని.లకు వెంకలక్ష్మి హిమబిందు మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ శుభకార్యానికి హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌ వేదికైంది. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.