చిత్రీకరణ ముగిసింది

యువ కథానాయకుడు సాయి ధరమ్‌ తేజ్, నభా నటేశ్‌ జంటగా రాబోతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకోబోతుంది. లాక్‌డౌన్‌ అనంతరం రామోజీ ఫిలిం సిటీలో ఓ పాట, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతుంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫి: వెంకట్‌ సి. దిలీప్, కూర్పు: నవీన్‌ నూలి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలుశ్రోతల్ని అలరిస్తున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.