నేను తీయాలనుకున్న సినిమా ఇది

అర్జున్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ్ఞప్లే బ్యాక్ఠ్‌. అనన్య నాయిక. హరి ప్రసాద్‌ జక్కా దర్శకుడు. ప్రసాద్‌రావు పెద్దినేని నిర్మాత. హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ్ఞ్ఞఈ కథ  నాకు బాగా నచ్చింది. నేను తీయాలనుకున్న సినిమా ఇది. చిన్న సినిమాలు ఈమధ్య కాలంలో బాగా ఆడుతున్నాయి. ఆ జాబితాలో ఈ చిత్రం కూడా చేరాల్ఠ్ఠన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ్ఞ్ఞ35 రోజుల్లోనే ఈ సినిమా పూర్తి చేశాం. అది కెమెరామెన్‌ బుజ్జి వల్లే సాధ్యమైంది. ఈ సినిమాని బాగా అర్థం చేసుకుని ఎడిటర్‌ నాగేశ్వర్‌రెడ్డి తీర్చిదిద్దారు. సుకుమార్‌తో నాది పాతికేళ్ల స్నేహం. తను ఈ చిత్రాన్ని ముందు నుంచీ ప్రోత్సహిస్తున్నాడ్ఠ్ఠన్నారు. సంగీత దర్శకుడు కమ్రాన్‌ మాట్లాడుతూ ్ఞ్ఞపాటలు బాగా వచ్చాయ్ఠ్ఠన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సూర్య ప్రతాప్, దినేశ్, డీజే, మాస్టర్‌ కార్తికేయ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.