‘గిటార్’

మాపతి, రేష్మా జంటగా తమిళంలో తెరకెక్కిన ‘గిటార్‌’ అదే పేరుతో తెలుగులో రాబోతోంది. ఆర్‌.ఇన్బశేఖర్‌ దర్శకుడు. నిర్మాత యం.రవి శేఖర్‌రెడ్డి వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. చిత్ర సమర్పకుడు వానపల్లి బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘‘సంగీతం నేపథ్యంగా సాగే చిత్రమిది. కథానాయకుడు గిటార్‌ వాద్యకారుడు. ప్రాణంతో సమానంగా భావించే గిటార్‌ అతన్నుంచి దూరమవుతుంది. దాన్ని తిరిగి ఎలా పొందాడనేది ఆసక్తికరం. ఇందులో ఒక మంచి ప్రేమకథ కూడా ఉంద’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘డి.ఇమాన్‌ సంగీతం ప్రధాన ఆకర్షణ. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామ’’న్నారు. ‘‘సంగీత ప్రధానమైన చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ చిత్రం విజయవంతం కావాల’’న్నారు నిర్మాత మోహన్‌ వడ్లపట్ల.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.