మాస్‌ కోణం బయటపడింది

‘‘మా అబ్బాయి నాగశౌర్యని ఇప్పటి వరకూ ప్రేమికుడిగానే చూశారు. ‘అశ్వథ్థామ’తో తనలోని మాస్‌ కోణం కూడా బయటపడింద’’న్నారు ఉషా మల్పూరి. ఆమె నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘అశ్వథ్థామ’. నాగశౌర్య, మెహరీన్‌ జంటగా నటించారు. రమణతేజ దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో నిర్మాత మాట్లాడుతూ ‘‘సామాజిక ప్రయోజనం ఉన్న చిత్రమిది. శౌర్య తన స్నేహితుడి జీవితంలో జరిగిన ఓ విషాద ఘటన నుంచి ఈ కథ అల్లుకున్నాడు. ఈ సినిమాతో శౌర్య రచయితగానూ పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. సాధారణంగా అగ్ర కథానాయకులకు మంచి ప్రారంభ వసూళ్లు వస్తాయి. కానీ శౌర్య సినిమాకీ అదే స్థాయిలో ఓపెనింగ్స్‌ రావడం ఆనందాన్ని కలిగించింది. కథపై నమ్మకంతోనే ఈ సినిమాని మా సంస్థలో తెరకెక్కించాం. త్వరలోనే శౌర్య రాసిన కథతోనే మరో సినిమా తీస్తాం. అయితే అందులో శౌర్య కాకుండా వేరే కథానాయకుడు నటిస్తార’’న్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.