నాగకన్య’ వచ్చేస్తోంది

జై, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాయ్‌లక్ష్మి, కేథరిన్‌ ప్రధాన పాత్రధారులుగా ఎల్‌.సురేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాగకన్య’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. లైట్‌హౌస్‌ సినీ మ్యాజిక్‌ పతాకంపై నిర్మాత కె.ఎస్‌.శంకర్‌రావు ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ కథలో నాగకన్య ఎవరన్నది ఆసక్తికరం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ రూపొందించాం. కింగ్‌ కోబ్రా నేపథ్యంలో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘పాము నేపథ్యంతో వచ్చిన ‘నోము’, ‘దేవి’, ‘పున్నమినాగు’, ‘అమ్మా నాగమ్మ’ తదితర చిత్రాలు ప్రేక్షకాదరణకి నోచుకున్నాయి. ఆ తరహా కథతోనే రూపొందించిన చిత్రమిది. హారర్‌ కథతో పాటు, ఆకట్టుకొనే నలభై నిమిషాల విజువల్‌ ఎఫెక్ట్స్‌ సన్నివేశాలు కీలకం. ప్రచార చిత్రాలకి మంచి స్పందన లభించింది’’ అన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.