‘వాల్మీకి’ వేడుకలో వెంకీమామ

ఎప్పుడెప్పుడా అని వరుణ్‌ తేజ్ అభిమానుతోపాటు సినీ ప్రియులు ఎదురు చూస్తున్న ‘వాల్మీకి’ సెప్టెంబరు 20న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ నెల 15న శిల్పకళావేదికలో ముందస్తు విడుదల వేడుకను నిర్వహించనుంది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్ర నటుడు వెంకటేశ్ హాజరవుతున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్దే కథానాయిక. వరుణ్,వెంకటేశ్‌ కలిసి ‘ఎఫ్‌ 2’ చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ కలవనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.