ఎన్నాళ్ల నుంచో చూస్తున్న విజయమిది

‘నే
ను చేసిన విజయ్‌కృష్ణ పాత్రలో... చాలామంది ప్రేక్షకులు తమని తాము చూసుకొంటున్నారు. ఎంతో మంది సామాజిక మాధ్యమాల ద్వారా  అభినందనలు తెలియజేస్తున్నారు. వాటిని చూస్తుంటే ఆనందం కలుగుతోంది’’ అన్నారు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి (సి.వి.ఎమ్‌), వై.రవిశంకర్‌ నిర్మాతలు. శుక్రవారం విడుదలైన చిత్రానికి వస్తున్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. ‘‘కుర్రాళ్లు థియేటర్లలో కేరింతలు కొడుతూ సినిమాని ఆస్వాదిస్తున్నారు. ఎప్పట్నుంచో ఎదురు చూస్తోన్న విజయం దక్కినట్టుగా భావిస్తున్నా. పెద్దవాళ్లు, మహిళలు కూడా సినిమాని సొంతం చేసుకున్నార’’ని సాయిధరమ్‌ తేజ్‌ చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ ‘‘ఈ ఆదరణ మరింత పెరుగుతుందనే ఆనందం పంపిణీ దారుల నుంచి కూడా  వ్యక్తమవుతోంది’’ అన్నారు. ‘‘కుర్రాళ్లు మా కథలా ఉందంటూ... బాగుందని ప్రచారం చేస్తుండడం సంతోషంగా ఉంది’’ అన్నారు దర్శకుడు కిషోర్‌.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.