సృష్టికీ.. మనిషి ఊహకి ముడిపెడితే!!

సృష్టికీ.. మనిషి ఊహకి ముడిపెడుతూ రాజకిరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్‌, ‘సత్యం’ రాజేష్‌ జంటగా నటించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌, రాజకిరణ్‌ నిర్మాతలు. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. విశ్వంలో మానవ మేథస్సుకి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి, సృష్టిలో ఏమైనా జరగొచ్చని చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. అందరూ తనవాళ్లే అనుకొనే ఓ మధ్య తరగతి అమ్మాయిగా నందితారాజ్‌ నటించింది. జీవితంలో ఆమెకి ఎదురైన సమస్యల్ని ఓ అజ్ఞాతవ్యక్తి పరిష్కరిస్తారు. అతనెవరన్నది తెరపైనే చూడాల’’న్నారు. విద్యుల్లేఖ రామన్‌, చమ్మక్‌ చంద్ర, కార్టూనిస్ట్‌ మల్లిక్‌, జీవా, రాకెట్‌ రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.