Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
ఆన్లైన్లో..
Search
ఆన్లైన్లో..
కథానాయికగా రానున్న శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ
దివంగత నటి శ్రీదేవి సినీవారసురాలిగా ఇప్పటికే ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్ సైతం త్వరలోనే కథానాయికగా పరిచయం కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుషీ తండ్రి, ప్రముఖ చిత్ర నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ.. మా చిన్నమ్మాయిని చిత్రసీమకు పరిచయం చేయడానికి కావాలని అన్నీహంగులు ఉన్నాయి. అయితే కథానాయికగా పరిచయం చేసేది మాత్రం నేను కాదన్నారు. కారణం ఏమిటంటే చిత్ర నిర్మాతగా నాకు, ఓ నటిగా ఖుషీ ఇదేమంత మంచి కాదు. ఎంత కుటుంబం చేయూత ఉన్నా, ప్రతి అమ్మాయితో పాటు మా అమ్మాయి ఖుషీ కూడా సొంతంగా రాణించాలని కోరుకుంటాను. ఆ కారణంతోనే నేను ఆమెను తొలిసారిగా వెండితెరకు పరిచయం చేయనని వెల్లడించారు. ఇక జాన్వీ కపూర్ ఇప్పటికే లండన్ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణను తీసుకొంది. ప్రస్తుతం ఓ ఫోటో షూట్ తీసుకున్నతన అందమైన ఫోటోలను ఖుషీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఖుషీ కపూర్ చిత్రసీమలోకి ప్రవేశించి ప్రేక్షకులను ఖుషీ చేస్తుందే లేదో తెలియాలంటే కథానాయికగా నటించిన తరువాతే తెలుస్తుంది.
జీవితమంటేనే ఎత్తుపల్లాలు: రకుల్ ప్రీత్
మన్మథుడు2 నటి రకుల్ ప్రీత్ సింగ్ ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా జిమ్‌లో దూరిపోతుంది. ఆరోగ్యమన్నా అందంగా ఉండటమన్నా రకుల్‌కి ఎంతో ఇష్టం. తాజాగా ఓ వర్కౌట్ చేస్తున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోకి తనదైన రీతిలో వ్యాఖ్యలను జోడిస్తూ..జీవితం అంటేనే హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాంటిది దాన్ని నేను స్క్వాట్స్ అని పిలుస్తాను..అంటూ పేర్కొంది. అయినా రకుల్ జీవితంలో ఎత్తుపల్లాల గురించి అప్పుడే అంత నేర్చుసుకుందాని కొంతమంది సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ కరోనా వైరస్ సోకింది. తరువాత దాన్నుంచి కోలుకుంది. తరువాత కోవిడ్ గురించి జాగ్రత్తలు తీసుకోమంటూ ప్రతిఒక్కరు బాధ్యతగా ఉండండి. మాస్కులు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకొని పాటించండి అంటూ’’ పేర్కొంది. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా (కొండపొలం) చేసింది. ఇందులో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించారు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నితిన్‌తో కలిసి ‘చెక్’ చిత్రంలో నటిస్తోంది. హిందీలో ‘మేడే’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.
‘గని’గా వరుణ్
యువ కథానాయకుడు వరుణ్‌తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ‘వీటీ 10’ వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ సినిమాకు ‘గని ’అనే టైటిల్ ఖరారు చేసినట్లు వెల్లడించింది చిత్రబృందం. నేడు (జనవరి 19) వరుణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో కూడిన మోషన్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. బాక్సింగ్ రింగ్‌లో తీక్షణమైన చూపులతో పంచ్ కొడుతున్న వరుణ్ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. రెనైసెన్స్ పిక్చర్స్ పతాకంపై సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాది జులైలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన సయీ మంజ్రేకర్ నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆదిపురుష్ ఆరంభం ఎప్పుడో తెలిసిపోయింది...
సాహో నటుడు ప్రభాస్ కథానాయకుడిగా హిందీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఇదొక పౌరాణిక గాథ, నాటి రామాయణమే ఈ సినిమా. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, లంకేషుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ పనిని ఈరోజు చిత్రబృందం ప్రారంభించింది. ఇలాంటి సాంకేతికతను అంతర్జాతీయ సినిమాల్లో మాత్రమే చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎంతో అత్యాధునిక సాంకేతికనుతో తెరకెక్కనున్న చిత్రాన్ని ఫిబ్రవరి 2న లాంఛనంగా ప్రారంభించనున్నారు. టీ-సీరీస్ పతాకంపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. అన్ని విధాల చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే యేడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో బిజీగా ఉన్నారు. మరోవైపు జనవరి 16న సలార్ చిత్ర ప్రారంభోత్సవంలో ప్రభాస్ పాల్గొన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
ఇకనైనా పితృస్వామ్య వ్యవస్థకు స్వస్తి పలుకుదాం: కాజల్
‘లక్ష్మీకళ్యాణం’తో 2007లో ‘లక్ష్మి’గా తెలుగుతెరకు పరిచయమైంది. ఆ తరువాత ‘చందమామ’గా అందరిచేత ‘మహాలక్ష్మి’ అనిపించుకుంది. ‘మగధీర’లో ‘మిత్రవింద’గా అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసింది. ఇక ‘ఆర్య2’లో ‘గీత’గా కుర్రకారును కవ్వించింది. ‘నేనే రాజు నేనే మంత్రి’లో ‘రాధ’గా భార్య అనే పదానికి అసలైన అర్థం చెప్పింది.. ఇప్పటికే అర్థమైంది కదా.. ఈ చర్చంతా కాజల్ అగర్వాల్ గురించే అని.
అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన విజయ్
ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ వచ్చేసింది. పవర్ఫుల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘లైగర్’ అనే పేరు ఖరారు చేశారు. సాలా క్రాస్‌బీడ్ ఉపశీర్షిక. సింహం, పులి కలయికనే లైగర్ అంటారు. టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ని ఆవిష్కరించిన పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వైపు సింహం, మరోవైపు పులి దర్శనమిస్తాయి. ఈ రెండిటి మధ్య విజయ్ చేతులకు బాక్సింగ్ గ్లౌజులు తొడుక్కుని మాస్ లుక్‌లో కనిపించి అదరగొడుతున్నాడు. పొడవైన జుత్తు, లైట్ గెడ్డంతో కొత్త విజయ్‌ని చూపించారు పూరి.
రాధేశ్యామ్‌లో నా పాత్ర పూర్తైయ్యింది: పూజాహెగ్డే
ఇటు తెలుగు సినిమాలతో పాటు అటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్న కథానాయిక పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ అమ్మడు బాహుబలి నటుడు ప్రభాస్‌తో కలిసి రాధేశ్యామ్ అనే రొమాంటిక్ చిత్రంలో నటిస్తుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో తన పోర్షన్ (పాత్ర) షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. చాలా సుధీర్ఘమైన 30రోజుల షెడ్యూల్ తరువాత రాధేశ్యామ్‌లో నా పాత్ర పూర్తి చేసుకుంది. ఆఫోటోలో కారులోని వెనుక సీట్లో కూర్చొని హైదరాబాద్ నుంచి ముంబై (విమానం ఎమోజి) అంటూ ఫోటోపై రాసింది.
రేపు ఉదయాన్నే దేవరకొండ సినిమా టైటిల్ ఆవిష్కరణ
అర్జున్‌రెడ్డి నటుడు విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ఫైటర్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక.
‘ఆచార్య’లో రామ్‌చరణ్ లుక్ చూశారా!
మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తరువాత నటిస్తోన్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి.
డ్యాన్స్ అంకుల్ రికీ పాండ్ బుట్టబొమ్మా పాట చూశారా
డ్యాన్స్ అంకుల్‌గా పిలుచుకునే రికీ పాండ్ ఇండియాలో డ్యాన్ అంకుల్‌గా పేరు పొందారు. ఆయన హిందీ చిత్రాల్లోని పాటలతో పాటు పలు గీతాలకు ఇన్‌స్టాగ్రామ్‌లో నృత్యం చేస్తూ అలరిస్తుంటారు. అలాంటి రికి గత నెల 22న అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములోని బుట్టబొమ్మా బుట్టబొమ్మా పాటకి స్టెప్పులేసి అదరగొట్టారు. ఇక బాలీవడ్ కింగ్‌ఖాన్ షారుక్ నటించిన దిల్ సే చిత్రంలోని ఛయ్యా..ఛయ్యా పాటకు సైతం డ్యాన్స్ చేసి బాలీవుడ్, టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్నారు. అతనికి భాష తెలియకపోయినా అదే విధంగా పెదవులు కదలిస్తూ..అదే స్టెప్పులతో అలరిస్తున్నారు. రికీ పాండ్ వృత్తి పరంగా గ్రాఫిక్ డిజైనర్. హిందీ పాటలకు నృత్యాలు చేస్తూ ఆ వీడియోలను తన సామాజిక మాధ్యమాల్లో పెట్టి సంతోషిస్తుంటారు. రికీ పాండ్ నృత్య వీడియోలకు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అతను చేసే నృత్యాలను చూస్తూ ఆనందిస్తున్నారు.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
ప్రారంభమైన ప్రభాస్ సలార్ చిత్రం
‘పీఎస్పీకే 27’.. మళ్లీ మొదలైంది
నిహారిక కొణిదెల వెబ్ సిరీస్ చిత్రం ప్రారంభం
ధనుష్ 43వ చిత్రం ప్రారంభం
మరో ప్రేమకథ మొదలైంది..
హీరోగా జానీ మాస్టర్
కార్యక్రమాలు
మరిన్ని
మహేష్ అందానికి కారణం ఏమిటో నాకు తెలుసు: విష్ణు
అబ్బాయి మెరుపుతీగలా’ ఉన్నాడు
విభిన్నంగా... ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు’
సంక్రాంతికి విడుదలవుతున్న “సైకిల్ ”
వైభవంగా సునీత-రామ్‌ల వివాహం
షూటింగ్ పూర్తి చేసుకున్న బ్యాక్ డోర్
అవి ఇవి
మరిన్ని
‘అలిమేలుమంగ’?
శ్రుతిహాసన్‌లా.. దాన్ని పైకి కనిపించనివ్వను
‘క్రాక్’ దర్శకుడితో.. కొత్త లుక్‌లో
బైక్‌పై 4500 కిలోమీటర్లు ప్రయాణించనున్న హీరో అజిత్
ఆర్.బాల్కి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్
సింహాద్రి చిత్ర నిర్మాత దొరస్వామిరాజు ఇకలేరు
ట్రైలర్...టీజర్
మరిన్ని
‘బంగారు బుల్లోడు’.. నవ్వులు పూయిస్తున్నాడు
అసలేం జరిగింది?
కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు..
ఆకట్టుకుంటోన్న డబ్యు.డబ్యు.డబ్లు టీజర్
ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం
ఇంతకీ ఆ కపటధారి ఎవరు?
ఆన్లైన్లో..
మరిన్ని
కథానాయికగా రానున్న శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ
జీవితమంటేనే ఎత్తుపల్లాలు: రకుల్ ప్రీత్
‘గని’గా వరుణ్
ఆదిపురుష్ ఆరంభం ఎప్పుడో తెలిసిపోయింది...
ఇకనైనా పితృస్వామ్య వ్యవస్థకు స్వస్తి పలుకుదాం: కాజల్
అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన విజయ్
ప్రకటనలు
మరిన్ని
కమల్‌కి శస్త్ర చికిత్స..
'ఇది మహాభారతం కాదు'...వర్మ కొత్త వెబ్‌సీరీస్ చిత్రం
‘ఆ ఒక్క చిత్రంలోనే నటిస్తున్నారు’
పవన్ - రానా చిత్రానికి మాటల రచయితగా త్రివిక్రమ్
‘సర్కారు వారి పాట’ గురించి ఏమన్నారంటే..
రాజకీయాల్లోకి రాను.. ఇబ్బంది పెట్టకండి!