సూర్య కొత్త చిత్ర టైటిల్‌ ఇదే!
ఇటీవలే ‘బందోబస్త్‌’ చిత్రంతో అలరించిన తమిళ నటుడు సూర్య మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘గురు’ ఫేం సుధా కొంగర సూర్యతో ‘సురరై పోట్రు’ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో రాబోతుంది. తాజాగా సూర్య ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఇందులో సూర్య గాల్లోకి ఎగిరినట్లు కనిపిస్తుంది. కళ్లజోడు పెట్టుకుని స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. చొక్కా లేకుండా నల్లని బనియన్‌తో అభిమానులకు ట్రీట్‌ ఇచ్చాడు. ఇప్పటికే ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతుందీ చిత్రం. టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని 2020 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. సంగీతం జి.వి.ప్రకాష్‌ కుమార్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.