'30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ఫస్ట్ లుక్ విడుదల

ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు నటిస్తున్న కొత్త చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా'. రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దగ్గర 'ఆర్య 2', 'నేనొక్కడినే' సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్లను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. పోస్టర్లో ప్రదీప్‌ తన ప్రేయసిగా నటిస్తోన్న అమృత అయ్యర్ తో పాటు కులాసాగా కనిపిస్తున్నాడు. ఇద్దరి ముఖాల్లోనూ ఉల్లాసం తాండవిస్తోంది. సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, చెట్లతో బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్‌ను తలపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది. ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రానికి అనూప్‌ అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్‌ పాటలు సమకూరుస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.