రిషి చెప్పిన ఓ మంచి మాట!
తాజాగా 43వ పుట్టిన రోజు జరుపుకున్న సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకు సినీ, రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఈ సందర్భంగానే మహేష్‌ ‘సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌’ కార్యక్రమంలో భాగంగా చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తాజాగా విడుదలైన ఈ వీడియోలో మహేష్‌ మాట్లాడుతూ ‘‘మన దేశంలో జరిగే యాక్సిడెంట్స్‌లో రోజుకి 28 మంది హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్లే చనిపోతున్నారు. అంటే 28 కుటుంబాలు వాళ్లు ప్రేమించే మనుషులను కోల్పోతున్నారు. జస్ట్‌ ఒక చిన్న కేర్‌లెస్‌ వల్ల. ఇట్స్‌ టైం ఫర్‌ ఏ ఛేంజ్‌. ఈ రక్షా బంధన్‌కి మీ అన్నయ్యకి, తమ్ముడికి రాఖీతో పాటు ఓ హెల్మెట్‌ని గిఫ్ట్‌గా ఇవ్వండి. తప్పకుండా పెట్టుకోమని చెప్పండి. లైఫ్‌ సేఫ్‌ ఈజ్‌ ఏ ఫ్యామిలీ సేఫ్‌. సిస్టర్స్‌ ఫర్‌ ఛేంజ్‌’’ అంటూ ఓ చక్కటి సందేశం అందించారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రిషి చెప్పిన ఓ చక్కటి మాటకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ ఛాలెంజ్‌ను తన సోదరుడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా తెరాస ఎంపీ కల్వకుంట్ల ప్రారంభించారు. దీనికి ఇప్పుడు మహేష్‌ లాంటి స్టార్‌ హీరో ప్రచారం దక్కడంతో అందరికీ చేరువవుతోంది. మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ కవిత ఈ వీడియోను ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటూ ప్రిన్స్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌’కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్‌. పవిత్రమైన కారణం కోసం ప్రారంభించిన ఇలాంటి పవిత్రమైన కార్యానికి మద్దతు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే మహేష్‌బాబు గారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.