ఆదా శర్మతో డ్యాన్స్ చేసే ఆ రహస్య ప్రియుడు ఎవరు?

అందాల కథానాయిక ఆదా శర్మ నిత్యం నెట్టింట్లో ఏదో ఒకటి చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇంతకీ షేర్‌ చేసిన ఆ వీడియోలో ఆదా ఎవరితో డ్యాన్స్ చేస్తుందో తెలియాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే. వీడియోలో ఆదా కలిసి ముఖం కనిపించకుండా నృత్యం చేసింది ఎవరో కాదు ఆదానే. ఎందుకంటే ముఖం కనిపించకుండా తన జుట్టును కప్పేసుకొని దిండు కవర్‌కి అమ్మాయిక డ్రస్ వేసి ఏమార్చింది. ఈ వీడియో ఓ ట్యాగ్‌లైన్‌ జతచేస్తూ..డ్యాన్స్ చేయడానికి తోడులేక పోతే నన్ను సంప్రదించండి. నేను మీకు పరిష్కారం చూపిస్తా..వెంటనే నా డ్యాన్స్ భాగస్వామిని కలవండి అంటూ ఇన్‌స్టాలో వెల్లడించింది. పూరి జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో వచ్చిన `హార్ట్ ఎటాక్‌`తో చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై యువ హృద‌యాలను దోచకుంది. ఆ తరువాత ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’, ‘సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్’‌, ‘గ‌రం’, ‘క్ష‌ణం’, ‘క‌ల్కీ’ వంటి చిత్రాల్లోనూ సందడి చేసింది. ప్రస్తుతం ఆదా తెలుగులో ‘క్వశ్చన్‌ మార్క్‌ (?)’ చిత్రంలో నటిస్తుంది.  విప్రా దర్శకత్వంలో గౌరు ఘనా సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల పూర్తయింది.  ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు.  

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.