ఆకాశవాణి సినిమా మోషన్‌ పోస్టర్‌ చూశారా!

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి వద్ద `ఈగ‌`, ‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అశ్విన్‌ గంగరాజు. ఇప్పుడు అతనే దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న వైవిధ్యభరిత కథా చిత్రం ‘ఆకాశవాణి’. కీరవాణి తనయుడు కాల‌భైర‌వ స్వరాలు సమకూరుస్తున్నారు. ఓ రేడియో చుట్టూ ద‌ట్ట‌మైన అడ‌విలో జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధిచిన మోషన్‌ పోస్టర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటో్ంది. ఆ పోస్టర్లో ఓ మర్రిచెట్టు ఆ చెట్టుకింద మేకల గుంపు. మర్రిచెట్టు ఊడలకు తలికిందలుగా వేలాడుతున్న ఓ బాలుడు, రేడియోలు ఉన్నాయి. మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే వైవిధ్యంగా ఉంది. తొలుత ఈ సినిమాకి దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రానికి సంబంధించి క్రియేటివిటీ విషయంలో నిర్మాత కార్తికేయ, దర్శకుడికి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. దీంతో అండ్‌ ఐ స్టూడియోస్‌ సంస్థకు చెందిన పద్మనాభరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. ప్ర‌ముఖ త‌మిళ దర్శక న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. సురేష్‌ రగుతు కెమెరామెన్‌గా, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటర్‌, మోహన్‌ చిత్రానికి కళను సమకూరుస్తున్నారు. త్వరలోనే సినిమాని ప్రేక్షకులు థియేటర్లో చూడొచ్చని చిత్రబృందం చెబుతోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.