ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న అభిషేక్‌ బచ్చన్‌

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ కరోనా వైరస్‌ సోకడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయనకు మరోసారి కోవిడ్‌ టెస్ట్ చేయగా నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. దాంతో ఆయన త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఇదే విషయాన్ని అభిషేక్‌ తన ట్విట్టరోలో చెబుతూ..‘‘నేను మీకు ముందే చెప్పాను. ఇది నిజం. ఈ రోజు మధ్యాహ్నం కోవిడ్‌-19 పరీక్ష చేయగా నెగటివ్‌ ఫలితం వచ్చింది. మీ అందరి ప్రార్ధనలు ఫలించాయి. అందరికి ధన్యవాదాలు. నేను ఇంటికి వెళ్తునందుకు సంతోషంగా ఉంది. నన్ను మా కుటుంబాన్ని ఇంత బాగా చూసుకున్నందుకు, కరోనా వైరస్‌ని జయించేందుకు సహాయ పడిన నానావతి వైద్యులకు, నర్సింగ్‌ సిబ్బంది మాకెంతో తోడ్పడ్డారు. మీరు లేకుంటే మేం ఏం చేయలేం..’’అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యలు కోలుకోని ఇంటికి చేరుకున్నారు. ఇక అభిషేక్‌ బచ్చన్‌ కూడా త్వరలోనే ఇంటికి వెళ్లనున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Abhishek Bachchan (@bachchan) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.